తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఆదరణ తక్కువే అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘కుందనపు బొమ్మ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఛాందినీ చౌదరీ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తోంది. రావడం రావడంతోనే ఈ ముద్దుగుమ్మ చాలా కాన్పిడెంట్‌గా మాటలు తూటాల్లా పేలుస్తోంది. అన్ని రకాల టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిల్ని ఆదరించి చూడండి ఇండస్ట్రీ ఏ రకంగా దశ తిరుగుతుందో అంటూ సవాల్ చేస్తోంది. రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో రూపొందిన ‘కుందనపు బొమ్మ’ సినిమా ఈ రోజు […]
Category: Movies
‘సుల్తాన్’ నోటికి తాళం పడింది
‘సుల్తాన్’ సల్మాన్‌ఖాన్ నోటికి తాళం పడింది. రేప్ వివాదంలో ఇరుక్కున్న ఈ కండల వీరుడు ఆ వివాదం తీవ్రతతో జాగ్రత్తపడ్డాడు. ఇకపై ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఎక్కువసేపు ఉన్నా, తక్కువే మాట్లాడతానని చెప్పాడు కూడా. వివాదంపై మాత్రం స్పందించలేదు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుని, ఇంకా తప్పుగా ప్రచారం చేశారని మాత్రమే సమాధానమిచ్చాడు సల్మాన్‌ఖాన్. అయితే అతని తండ్రి, తన కుమారుడు చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకున్నాడు. అదే సంస్కారం సల్మాన్‌ఖాన్ కూడా ప్రదర్శించి […]
గ్యారేజీపై హైప్‌ని తారక్ తట్టుకోగలడా!
కొరటాల శివ డైరెక్షన్‌లో రానున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. ఎంతలా? అంటే జూనియర్ ఎన్టీఆర్ అదేనండీ తారక్ తట్టుకోగలడా? అన్న అనుమానాలు కలిగేంతలాగా అట. సినీ వర్గాల్లో ‘జనతా గ్యారేజ్’ గురించి జరుగుతున్న చర్చ, సినీ ప్రముఖులనే ఆశ్చర్యపరుస్తోందని సమాచారమ్. కనీ వినీ ఎరుగని స్థాయిలో సినిమాకి బిజెనెస్ అవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో తారక్ మెయిన్ ఫ్యాక్టర్. తారక్‌కి దర్శకుడు కొరటాల శివ ఫ్యాక్టర్ యాడ్ అవడంతో, సినిమా మీద […]
షాక్ ఇస్తున్న సంపూ ఓవర్సీస్ క్రేజ్
హిట్టు-ఫట్టులతో పనిలేదు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బరిలో ఉన్నాడంటే అందరికీ ఆసక్తే. అతడి సినిమాలు ఎలా ఉన్నా ముందస్తుగా వచ్చే టీజర్లు, ట్రైలర్లను జనాలు తెగ చూస్తుంటారు. తొలి చిత్రం ‘హృదయ కాలేయం’ నుంచే టాలీవుడ్ లో సంచలనం రేపాడితడు. సరికొత్త అభినయం, ఆహార్యంతో మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో బాక్సాఫీసు వద్ద ఆయన చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఈ కోవలో సంపూ నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’ మరింత సెన్సేషన్ రేపుతోంది. టైటిలే ఇంత […]
‘జనతా గ్యారేజ్’లో ఆమె ఉందట!!
కోలీవుడ్-టాలీవుడ్ ల్లో ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకుంది దేవయాని. అప్పట్లో టాప్ హీరోలతో పాటూ యువ హీరోలతోనూ జోడీకట్టి అలరించింది. ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ సినిమాలకు స్వస్తి చెప్పి ఓ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి.ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సరసన సుస్వాగతం సినిమాలో నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాక మళ్ళీ అంతటి సినిమా ఆమెకి దొరకలేదు.ఏదో అడపా దడపా సినిమాల్లో కనిపించింది అంతే. ఇదిలా ఉంటే, మూవీలకు దూరంగా ఉన్న […]
తమన్నా ప్లాప్ ఫిలాసఫీ
జూనియర్ మాధురి దీక్షిత్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను అడపాదడపా పేర్కొంటారు. అందం-అభినయం కలబోత ఈ పాలనురుగు సుందరి. టాలీవుడ్-కోలీవుడ్ ల్లో స్టార్డమ్ ఎంజాయ్ చేసిన తమన్నా.. బాలీవుడ్ లోనూ లక్ పరీక్షించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అమ్మడు సక్సెస్ కాలేదు. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ జాబితాలో పడ్డాయి. ఇదే విషయమై ఎదురైన ప్రశ్నకు వేదాంత ధోరణిలో బదులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. విజయాలు-వైఫల్యాలు మన చేతుల్లో లేవు కదా అంటూ వ్యాఖ్యానింది. ఇంట గెలిచి రచ్చ […]
రిలీజ్ కి రెడీ అయిన సూర్య “మేము”
సూపర్ స్టార్ సూర్య, అమలాపాల్, బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన పసంగ-2 తెలుగులో మేము పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ 2 డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై.. సూర్య స్వయంగా సమర్పిస్తుండడం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న మేము చిత్రం జూలై […]
నాగ్ న్యూలుక్
మాస్ పాత్ర అయినా, క్లాస్ పాత్ర అయినా… నాగార్జున లుక్ అందుకు తగ్గట్టు ఇట్టే మారిపోతుంది. గ్రీకువీరుడులో పిల్లిగెడ్డంతో, శ్రీరామదాసులో పొడవాటి జుట్టుతో, సోగ్గాడే… లో నిజంగా సోగ్గాడిలాగే… రకరకాల గెటప్ లు వేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగార్జున. ఈ ఏడాది సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలతో సూపర్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుం నిర్మల కాన్వెంట్లో ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. మోకాలి వరకు మడతపెట్టిన ప్యాంటు, […]
అదరగొడుతున్న కబాలి హీరోయిన్!!
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలీ’ మూవీలో మెరిసిన రాధికా ఆప్టే.. ఆ సినిమా విడుదలకు ముందే వార్తల్లో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ఓ షార్ట్ ఫిల్మ్ ఆమెను న్యూస్ లో నిలిపింది. గతేడాది ‘అహల్య’ అనే షార్ట్ ఫిల్మ్ తో రాధికా నెటిజన్లు, సినీ ప్రియులను అలరించింది. సహజ నటనతో కట్టిపడేసే ఈ సుందరి మరో లఘు చిత్రంతో అదే ట్రెడిషన్ రిపీట్ చేసింది. శిరీష్ కుందర్ రూపొందించిన ‘కృతి’లో నటనకు రాధికాను […]