మెగా హ్యాట్రిక్ హీరో, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అంటే మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.ఇప్పటి వరకు చేసిన 3 సినిమాల్లో మాస్ ని ఒక ఊపు ఊపేసాడు ఈ మెగా హీరో.కాగా ఈ హ్యాట్రిక్ హీరో కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. అదే క్లాస్ డైరెక్టర్ గౌతం వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో అనుష్క తమన్నా హీరోయిన్లు గా ఒకేసారి నాలుగు భాషల్లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. […]
Category: Movies
‘నేను లోకల్’ అంటున్న నాని!
యూత్ హీరోస్‌లో నాని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్న పాత్రలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. నాని సినిమా అంటే కొత్తదనం గ్యారంటీ అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగించాడు. ‘జెంటిల్‌మన్’తో ఈ భావనకు నూరుశాతం న్యాయం చేశాడు. ప్రస్తుతం నాని చేస్తున్న ప్రాజెక్టుల్లో త్రినాథ్ రావు తెరకెక్కిస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్టైనర్‌గా సాగే ఈ చిత్రానికి ‘నేను లోకల్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘నేను లోకల్’ అనే […]
‘ధ్రువ’లో రాంచరణ్ లుక్ అదుర్స్
తమిళంలో సూపర్‌హిట్ ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ జోరుగా సాగిపోతోంది. లీడ్ రోల్ పోషిస్తున్న రామ్ చరణ్ పోలీసాఫీసర్‌గా అలరించనున్నారు. పాత్ర కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధే తీసుకున్నారు. డైట్ కూడా మార్చినట్లు సమాచారం. ఈ సినిమాలో చరణ్ గెటప్ ఎలా ఉంటుందో తెలీలేదు. తాజాగా ఈ సంగతీ బయటకొచ్చేసింది. ‘ధ్రువ’లో చరణ్‌కు సంబంధించిన ఓ లుక్ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చెర్రీ పోలీస్ యూనిఫామ్‌లో మాంఛి ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఈ ఫొటోను నవదీప్ సోషల్‌మీడియాలో పెట్టాడట. […]
కబాలి ప్రొమోషన్ పీక్స్!
ఇప్పటి వరకు సినిమా పోస్టర్లు గోడలు..బస్సుల మీదే కనిపించేవి. కాని ఇప్పుడు అది విమానాలకూ పాకింది. రజినీకాంత్ తాజా చిత్రం కబాలీ ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డులకెక్కనుంది. దేశంలోనే తొలిసారిగా విమానాల ద్వారా ప్రచారం చేసుకున్న సినిమాగా నిలిచింది. సినిమా రిలీజ్ రోజున బెంగళూరు నుండి చెన్నైకి ఎయిర్ ఏసియా ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. సినిమా విడుదల రోజు ఉదయం ఆరుగంటల పది నిమిషాలకు బెంగళూరు నుంచి బయలు దేర వెళ్లే విమానం ఏడు […]
అందరి చూపు చైతు వైపు
తొలి సినిమాతోనే ఒక ప్రయోగం చేశాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. ‘జోష్’ లాంటి సందేశాత్మక చిత్రంతో ఎంట్రీ ఇచ్చి పరాజయం అందుకున్నాడు. యూత్‌ని ఆలోచింపచేసే ఈ సినిమాలో నాగచైతన్య తన నటవిశ్వరూపం చూపించినప్పటికీ అది అంతగా కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత ‘ఏ మాయ చేశావె’ సినిమాతో అందరికీ దగ్గరయ్యాడు. ఆ వెంటనే మాస్ సినిమాలు ట్రై చేసి మళ్లీ నిరాశపరిచాడు. అందుకే ఇప్పుడు మాస్ జోలికి పోకుండా మళ్లీ లవర్ బాయ్‌లా మారిపోయాడు. చైతూ […]
సల్మాన్ వివాదం అందుకోసమేనా!
ఒక్క క్షమాపణ చెబితే వివాదం సద్దుమణిగిపోతుంది. తద్వారా మహిళల్ని ఆయన గౌరవించినట్లవుతుంది. కానీ బాలీవుడ్ కండల హీరో సల్మాన్‌ఖాన్ క్షమాపణ చెప్పబోనంటున్నాడు. షూటింగ్ తర్వాత తన కష్టం గురించి చెబుతూ, రేప్‌కి గురైన స్త్రీలా నా పరిస్థితి ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేసులు కూడా నమోదయ్యాయి. మహిళా సంఘాలు సల్మాన్‌ఖాప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే సల్మాన్‌ఖాన్ ఈ వివాదంపై మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. బాలీవుడ్‌లో చాలామంది సల్మాన్‌ఖాన్ సన్నిహితులు అతని తీరుని తప్పుపట్టడం చూశాం. […]
ఇలియానా ఆశలన్నీ దానిపైనే
ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉన్న హీరోయిన్స్‌లో ఫస్ట్ లిస్టులోకి చేరిపోయింది ముద్దుగుమ్మ ఇలియానా. ఒకప్పుడు అందరి స్టార్‌హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అన్పించుకుంది ఇల్లూ బేబీ. ఇప్పుడు అవకాశాల్లేక విమర్శలతో వార్తల్లోకెక్కుతోంది. తాజాగా బాలీవుడ్‌లో ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా ‘రుస్తుం’. అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజగా విడుదలయ్యింది. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కన్నా, అందులో ఇలియానా నటనకే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. […]
రీ ఎంట్రీకి సై అంటోన్న యోగా బ్యూటీ
శిల్పాశెట్టి ఈ ముద్దుగుమ్మ అందం అందరికీ సుపరిచితమే. తెలుగులోనూ పలుచిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అయితే కెరీర్ బాగున్న టైంలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకుని సెటిలై పోయింది. పెళ్లయ్యాక ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం అయ్యింది. కానీ పెళ్లయ్యాక కూడా తనకు సినిమా ఆఫర్స్ వచ్చాయట. కానీ తాను మెచ్చే పాత్రలు కావవి. అందుకే నటించడానికి ఇష్టపడలేదు అంటోంది. కానీ టీవీ షోస్‌లోనూ, కమర్షియల్ యాడ్స్‌లోనూ ఈ బ్యూటీ విరివిగా […]
అక్కినేని డబుల్ ధమాకా-ఒక వేదిక రెండు పెళ్లిళ్లు
అక్కినేని నాగ చైతన్య ,సమంతల ప్రేమ వ్యవహారం ఈ మధ్య బాగా చర్చినీయాంశం అయింది.సోషల్ మీడియా లో అయితే ప్రతిరోజు వీరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా చైతు,సమంతల పెళ్లికి నాగార్జున పచ్చ జెండా ఊపాడని తెలుస్తోంది.ఓ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ నాగార్జునే స్వయంగా నేను అమల చైతన్య విషయంలో చాలా సంతోషంగా వున్నాం.చైతు జీవితభాగస్వామిని,ఎవరితో అయితే తాను హ్యాపీ గా ఉంటాడో వారినే ఎంచుకోవడం మాకు చాలా అందంగావుంది అని […]