పదేపదే అభాసుపాలు.. జగన్ తీరు మారదా?

అమరావతి రాజధాని కేసులకు సంబంధించి రోజువారి విచారణలు ప్రారంభం అయ్యాయి. సీజే ప్రశాంత్ మిశ్రతో సహా మరో ఇద్దరు న్యాయమూర్తులు వాదనలు వింటున్నారు. తొలిరోజు అమరావతి రైతుల తరఫున వినిపించిన వాదనల్లో ‘మూడు రాజధానులు’ అనే ఆలోచనే మరచిపోవాలంటూ.. వారు విన్నవించడం జరిగింది. మొత్తానికి రోజువారీ విచారణల పర్వం మొదలైంది గనుక.. అమరావతి రాజధాని విషయంలో తొందరల్లోనే ఒక నిర్ణయం వస్తుందని.. అమరావతా? మూడు రాజధానులా? అనే విషయంలో కోర్టు పరంగా ఉన్న అడ్డంకి తొలగిపోతుందని అనుకోవచ్చు. […]

సుజనా, సీఎంలకు తలంటు పోసిన అమిత్ షా!

కేవలం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం మాత్రమే కాదు..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన తిరుపతి పర్యటనను రాష్ట్రంలో పార్టీని చురుగ్గా పరుగులు పెట్టించడానికి కూడా ఒక అవకాశంగా మలచుకున్నారు. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం నాడే పూర్తి కాగా, సోమవారం పూర్తిగా పార్టీ నేతలతోనే గడిపారు. వారితో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం గురించి.. వారికి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ […]

కేసీఆర్.. ఒక ధీరోదాత్తుడి ధిక్కారం!

కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్రమోడీతో సమానంగా చక్రం తిప్పుతున్న హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చి.. తన ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు కావాల్సిన స్థాయి సమావేశం అది. అత్యున్నత స్థాయి సమావేశం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. ఆయన హాజరు కాదలచుకోలేదు. ఆ రకంగా.. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే ఆలోచనలతో నిత్యం పెట్రేగుతూ ఉండే.. […]

బాబు ప్రాభవానికి గండికొట్టే ఎన్నికలివి!

కుప్పం మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రాభవానికి గండి పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. 25 వార్డులు ఉన్న కుప్పం మునిసిపాలిటీలో- 15 వార్డుల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందగలరా అనేది కూడా ప్రశ్నార్థకమే అవుతుంది! తన సొంత ఊరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గం తనను తిరస్కరించిన తర్వాత.. చంద్రబాబు జిల్లాకు ఒక మూలగా […]

జగన్‌కు పనిచెప్పడమే పవన్ కల్యాణ్ పోరాటమా?

విశాఖ ఉక్కును తాను కాపాడేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ వాసులకు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. అదే వేదిక మీదనుంచి.. జగన్మోహన్ రెడ్డి ఏం పనులు చేయాలో, విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవాలో.. కొన్ని పనులను పవన్ కల్యాణ్ డిక్టేట్ చేశారు. విశాఖ ఉక్కుకోసం ఆయన పోరాటంలో తొలి అధ్యాయం అలా ముగిసింది. సినిమాల షూటింగులకు మధ్య వచ్చే షెడ్యూల్ గ్యాప్‌లో పవన్ […]

రాజకీయ విమర్శలే వాంగ్మూలంలోకి వచ్చాయే!

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన నాటినుంచి.. ఆ దుర్ఘటనను వాడుకునిన జగన్మోహన రెడ్డి ని ఇరుకున పెట్టడానికి విపక్ష తెలుగుదేశం అనేక రకాల కుట్రపూరిత ప్రచారాలకు తెరలేపింది. ‘చిన్నాన్న హత్యతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ప్రత్యక్ష ప్రమేయం ఉంది’ అనే విమర్శ చేయలేదు తప్ప.. అలాంటి భావనను కలిగించేలా తెలుగుదేశం నాయకులు రకరకాల విమర్శలు చేశారు. కేసు విచారణను జగన్ కావాలనే పక్కదారి పట్టిస్తున్నట్టుగా, కేసు విచారణలో కాలయాపనకు కారణం అవుతున్నట్లుగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. […]

పవన్ భజన చేస్తున్న టీడీపీ దళాలు!

జనసేనాని పవన్ కల్యాణ్ షూటింగుల విరామంలో ఒక సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. చాన్నాళ్ల తర్వాత.. ఎదురుగా షూటింగు కెమెరాలు కాకుండా ప్రజలు కనిపించారు. చాన్నాళ్ల తర్వాత మైకు దొరికింది. మైకు దొరకడమే తడవుగా.. అది సినిమా ఫంక్షన్ అనే సంగతిని మర్చిపోయి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎడా పెడా తూర్పారపట్టేశారు. యావత్ సినీ పరిశ్రమకు తాను రక్షకుడు అన్న రీతిలో.. పరిశ్రమ తరఫున తానొక్కడే గళంవినిపిస్తున్నాననే రీతిలో.. గర్జించారు. ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఇదంతా ఒక […]

జగన్ గారూ.. చురుగ్గా స్పందించాల్సిందే!

అమ్మాయిల మానరక్షణ కోసం, దుర్మార్గుల వెన్నులో వణుకు పుట్టించడం కోసం ‘దిశ’ వంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి ఆయన పార్టీకి చెందిన వారే.. అకృత్యాలకు పాల్పడితే ఏం చేయాలి? పార్టీ ఎలా స్పందించాలి? ఆరోపణలు వచ్చిన తక్షణమే స్పందించి, చర్యలు తీసుకుంటే తప్ప.. ఇతరత్రా దక్కుతున్న మంచిపేరును ప్రభుత్వం నిలబెట్టుకోవడం కష్టం. విశాఖ జిల్లా సీలేరులో ఒక దుర్మార్గం జరిగింది. ఆ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిన్న […]

పరువు పోయె : వెల్లంపల్లి ప్రకటనతో మరిన్ని సందేహాలు

కోర్టులనుంచి వరుస ఎదురుదెబ్బలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరమైనవి. భారీ సంఖ్యలో టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ జగన్ సర్కారు జీవో ఇవ్వగా, ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం పెద్ద విషయమేమీ కాదు. కొత్త సంగతి కూడా కాదు. అయితే […]