చంద్ర‌బాబు ” వాస్తు ” హిట్ కొట్టిందా

ఏపీ సీఎం చంద్ర‌బాబు నోట వాస్తు వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి టెక్నాల‌జీని న‌మ్మే ఆయ‌న వాస్తును న‌మ్ముతున్న‌ట్టు చెప్ప‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి క‌లిగించింది. ఇటీవల ఆయ‌న వెల‌గపూడిలో నిర్మించిన నూత‌న స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్‌ను బాబు ప్రారంభించారు. పూర్తి వాస్తు ప్ర‌మాణాల‌తో ఈ ఛాంబ‌ర్‌ను నిర్మించారు. ఇక‌, త‌న ఛాంబ‌ర్‌ను ఇటీవ‌ల ప్రారంభించిన బాబు.. ప్ర‌స్తుతం అక్క‌డి నుంచే పాల‌న సాగిస్తున్నారు. అదేవిధంగా త‌న ఛాంబ‌ర్‌లోకి ప్ర‌వేశించిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు రెండు సంత‌కాలు చేసిన విష‌యం తెలిసిందే. […]

టీ కాంగ్రెస్‌లో సొమ్మున్న నేత‌ల పోస్టు వాంటెడ్‌..!

అవును! మీరు చ‌దివింది నిజ‌మే!! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పోస్టుల‌కు అంతే కీల‌క‌మైన అభ్య‌ర్థుల కోసం పార్టీ ఎదురు చూస్తోంద‌ట‌! ప్ర‌స్తుతం ఉన్న నేత‌లంతా ఉత్తుత్తి బ్యాంకు మాదిరిగా ఉత్తుత్తి బ్యాచ్‌లా త‌యార‌య్యార‌ని కాంగ్రెస్ అధిష్టానానికి రిపోర్టులు వెళ్లిన‌ట్టు స‌మాచారం .ఈ క్రమంలో మంచి ద‌మ్ము, సొమ్ము ఉన్న నేత‌లు రంగంలోకి దిగితేకానీ, 2019లో అధికార టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్ప‌డం కుద‌ర‌ద‌ని ఓ డెసిష‌న్‌కి వ‌చ్చింద‌ట అధిష్టానం. ఈ క్ర‌మంలోనే సొమ్మున్న నేత‌ల […]

కాంగ్రెస్‌లోకి కోదండ రాం..!

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మేనంటున్నారు టీఆర్ ఎస్ నేత‌లు. తెలంగాణ ఉద్య‌మంలో రాత్రిబ‌వంళ్లు శ్ర‌మించిన ప్రొఫెస‌ర్ కోదండ రాం.. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి తెలంగాణ‌ ఉద్య‌మానికి ద‌శ దిశ చూపిన వారిలో కోదండ‌రాం ప్ర‌ముఖులు. అయితే, రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం, ఆయ‌న అధికారానికి దూరంగానే ఉండిపోయారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో చేర‌తార‌ని అంద‌రూ భావించినా.. ఆయ‌న మాత్రం ఉద్య‌మ‌కారుడిగానే ఉండిపోయారు. ప్ర‌భుత్వంపై సూటి విమ‌ర్శ‌లు చేయ‌డంతో సీఎం కేసీఆర్‌కు ఆయ‌న‌కు మ‌ధ్య సంబంధాలు కూడా […]

ఆ మంత్రికి ప్ర‌జ‌ల కంటే కొడుకు హీరో అవ్వ‌డ‌మే ముఖ్య‌మా..!

ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఆ మంత్రిగారు త‌న సొంత లాభం కొంత కూడా మానుకోవ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల‌ ప్ర‌యోజ‌నాల క‌న్నా.. త‌న సొంత ప్ర‌యోజ‌నాల‌కే ఆయ‌న పెద్ద పీట వేస్తున్నార‌ట‌! ప్ర‌స్తుతం దీనిపై అంద‌రూ చ‌ర్చించు కుంటున్నారు. మ‌రి అదేంటో చూద్దాం.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో అనేక ప‌రిశ్ర‌మ‌లు వెలిశాయి. ఇదే క్ర‌మంలో ఉమ్మ‌డిగా ఉన్న టాలీవుడ్ కూడా ఏపీలో విస్త‌రిస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఇదే క్ర‌మంలో చంద్ర‌బాబు […]

ఆ ఏపీ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో కులాల చిచ్చు

సామాజిక వ‌ర్గాల ఆధిప‌త్యానికి ఇప్పుడు మంత్రి రావెల కిశోర్ బాబు నియోజ‌క‌వ‌ర్గం కేరాఫ్‌గా మారిందా? అక్క‌డ రావెల సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు సొంత పార్టీలోని ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌నే టార్గెట్ చేస్తున్నాయా? ఈ క్ర‌మంలో మిగిలిన సామాజిక వ‌ర్గాల నేతలంగా ఇప్పుడు రావెల‌కు యాంటీగా మార‌బోతున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో!! ఇక‌, విష‌యంలోకి వెళ్లిపోతే.. ఐఆర్‌టీఎస్ అధికారిగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన రావెల కిశోర్‌బాబు 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాడు […]

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీగా ఉన్న జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న సినిమాల స్పీడ్‌ను పెంచేశాడు. ఇప్పుడు ప‌వ‌న్ సినిమాల కోసం త‌న గేరును ఓ రేంజ్‌లో పెంచేశాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం గోపాల గోపాల డైరెక్ట‌ర్ డాలీ డైరెక్ష‌న్‌లో ‘కాటమరాయుడు’ షూటింగ్ చకచకా కానిచ్చేస్తున్నాడు ప‌వ‌న్‌. ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా మార్చి 28న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే అప్పుడే మ‌రో రెండు సినిమాల‌కు కూడా కొబ్బ‌రి […]

ట్రంప్ దెబ్బ‌కు భ‌గ్గుమ‌న్న బంగారం

అమెరికాకు జ‌లుబు చేస్తే.. ప్ర‌పంచానికి తుమ్ములు వ‌స్తాయ‌న్న నానుడి మ‌రోసారి రుజువైంది. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌పంచ వాణిజ్యాన్ని శాసిస్తున్నాయి. త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఎన్నిక‌ల్లో హాట్ ఫేవ‌రెట్ లీడ‌ర్‌గా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌.. సౌమ్యురాలు, మాజీ విదేశాంగ మంత్రి హిల్ల‌రీ క్లింట‌న్ల మ‌ధ్య పోరు క్ష‌ణ క్ష‌ణానికి ఉత్కంఠ‌గా మారుతోంది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఆధిక్యం తారుమారవుతోంది. డొనాల్డ్‌దే ఆధిక్యం అని అనుకున్న త‌దుప‌రి నిమిషంలోనే హిల్ల‌రీ.. కాదు..కాదు.. హిల్ల‌రీ […]

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఇండియ‌న్ల విజ‌యం

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు అమెరికా ఎన్నిక‌ల గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రపంచమంతా తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. గంట గంటకూ ఆధిక్యం చేతులు మారుతూ, నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోరులో తొలి నుంచి వివాస్ప‌ద వార్త‌లు చేస్తూ వ‌స్తోన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ మ్యాజిక్ మార్క్‌కు చేరువై అంద‌రికి షాక్ ఇచ్చారు. మొత్తం 538 ఓట్లున్న ఎలెక్టోరల్‌ కాలేజీలో ట్రంప్‌ 244 ఓట్లు సాధించారు. కాగా […]

కేసీఆర్ ఫీల్ గుడ్ స్టోరీ

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు బ‌స్సు యాత్ర‌కు సిద్ధం అవుతున్నారు. ప్ర‌భుత్వానికి, పార్టీకి మ‌రింత జోష్ పెంచేందుకు ఆయ‌న రెడీ అయ్యారు. అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌వుతుండ‌డం, ప‌థ‌కాలు, ప్రాజెక్టులు వంటివి పెద్ద ఎత్తున అమ‌లు చేస్తుండ‌డంతో ఆయ‌న ఆయా విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. మ‌రోప‌క్క‌, కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న యాంటీ ప్ర‌చారం కేసీఆర్‌కు పెద్ద ఎత్తున విసుగు తెప్పిస్తోంది. ప‌థ‌కాలు న‌త్త‌డ‌క‌న సాగుతున్నాయ‌ని, ఆరోగ్య శ్రీవంటివి కుంటుప‌డుతున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. […]