ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత టీడీపీ బాధ్యతలు మోయాల్సిన నాయకుడు లోకేష్! టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిన నేత! లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని టీడీపీ నేతలంతా కోరుకుంటున్నారు. అయితే అందరూ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా.. బాబు మాత్రం కీలక పదవి ఇచ్చేందుకు వెనుకాడుతూనే ఉన్నారు. పార్టీపై పట్టు సాధించలేకపోవడం, చురుకుగా వ్యవహరించలేకపోవడం.. ఇంకా తండ్రిచాటు బిడ్డగానే ఉండటం.. వంటి కారణాలతో ఎప్పటికప్పుడు అడ్డంకులు వేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేసేందుకు చంద్రబాబు […]
Author: admin
మెగా అభిమానులకు గుడ్ న్యూస్
టాలీవుడ్‌లో నిన్నటి తరంలో ఎన్టీఆర్-ఏఎన్నార్-సూపర్‌స్టార్ కృష్ణ-శోభన్‌బాబు-కృష్ణంరాజు తర్వాత మల్టీస్టారర్ సినిమాలు లేవు. చాలా రోజుల తర్వాత విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఒక్కడు మాత్రమే మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్, రామ్ వంటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు. వెంకటేష్ తర్వాత మరే అగ్రహీరో మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. అయితే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఆ సినిమాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోనుండడం విశేషం. […]
వైసీపీ అడ్రస్ మార్చవా జగన్..!
విభజన తర్వాత ఏపీ పరిపాలన అంతా నవ్యాంధ్ర నుంచే జరుగుతోంది. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతేగాక జగన్ హైదరాబాద్‌లోనే ఉండటంతో ఆయన్ను కలిసేందుకు నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ విషయాలు అధినేతతో మాట్లాడాలంటే హైదరాబాద్ వరకూ రావాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని ఎప్పుడు నవ్యాంధ్రకు తరలిస్తారోనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 2019లో ఎలాగైనా […]
డీఎల్‌పై జగన్ మైండ్‌గేమ్ ?
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం సాధారణమే! అయితే ఇప్పుడు కడప జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు స్థానికంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు అనే సూక్తిని నిజం చేసేలా కనిపిస్తోంది. వైఎస్‌ను, ఆయన తనయుడు జగన్‌ను శత్రువులా భావించే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఫొటో వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో కనిపించడం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తోంది. కడప గడపలో రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. తన […]
షాక్: మహేష్-దిల్ రాజు మూవీ రిలీజ్ డేట్
గతేడాది బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ మూవీలో నటించిన ప్రిన్స్ మహేష్‌బాబు ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా (వర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ)లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ డీవీవీ దానయ్య నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్టులో నటించనున్న సంగతి తెలిసిందే. మురుగదాస్ సినిమాతో పాటు, కొరటాల శివ సినిమాపై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ కేరీర్‌లోనే 25వ […]
శతమానం 3 రోజుల వసూళ్లతో టాలీవుడ్ షేక్
గత సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాల టఫ్ కాంపిటేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్ ఈ సంక్రాంతికి అగ్ర హీరోలు చిరు-బాలయ్య ల్యాండ్ మార్క్ మూవీలతో పోటీపడి శతమానం భవతి రూపంలో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శతమానం భవతి సంక్రాంతి రోజున థియేటర్లలోకి వచ్చింది. రెండు పెద్ద సినిమాలు బరిలో ఉండడంతో శతమానం భవతిపై ముందుగా ఎవ్వరికి అంచనాలు […]
కేటీఆర్ కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!
తెలంగాణలో ఇప్పుడు వారసత్వ రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో తండ్రీ కొడుకులు ములాయం, అఖిలేష్‌ల మధ్య జరిగిన రాజకీయ రగడ నేపథ్యంలో తెలంగాణలోనూ పరిస్థితి ఆదిశగా దారితీస్తుందా? అని అందరూ చర్చించుకున్నారు. అయితే, అలాంటి పరిస్థితి రాదని, కేసీఆర్ పక్కా వ్యూహంతోనే ఉన్నారని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పొసుకున్న టీఆర్ ఎస్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాజకీయ పార్టీగా అవతరించింది. తెలంగాణ తొలిసీఎంగా […]
చంద్రబాబుకు యాంటీగా ఏపీలో బస్సు యాత్ర
పాలిటిక్స్‌లో ఒకరి ఐడియాను ఇంకొకరు కాపీ కొట్టినా తప్పుకాదు! ఇప్పుడు సీపీఐ నేతలు ఏపీ సీఎం చంద్రబాబు గతంలో చేపట్టిన ఓ యాత్రనే మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నారు. చంద్రబాబు పాలనపై దండెత్తుతున్న సీపీఐ.. ప్రజల్లోకి మరింత వేగంగా త మ ప్రణాళికలను తీసుకువెళ్లేందుకు, బాబును ఏకేసేందుకు బస్సు యాత్రను మించింది మరోటి లేదని డిసైడ్ అయింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చేపట్టబోయే బస్సు యాత్ర అన్ని విధాలా బాగుంటుందని సీపీఐ […]
ఎమ్మెల్యేలను ఇరుకున పడేసిన కేసీఆర్
`తెలంగాణలో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం` అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. ముఖ్యంగా ఆయన దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయింది కూడా! అయితే ఇప్పుడు అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం వల్ల ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఈ నిర్ణయం ఇప్పుడు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. తమ నియోజకవర్గాల్లో ఎప్పుడు డబుల్ నిర్మాణం పూర్తవుతుందో అని.. ఆ ప్రాంత ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తుండటంతో ఏం సమాధానం చెప్పాలో […]