వైసీపీలోకి ర‌ఘువీరా…జ‌గ‌న్ ఆఫ‌ర్ ఇదేనా..!

రాష్ట్ర విభ‌జ‌న దెబ్బ‌కు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని గుర్తు చేసుకోవాల్సిన ప‌రిస్థితి. రాష్ట్ర విభ‌జ‌న పాప‌మంతా కాంగ్రెస్ పార్టీ నెత్తిమీదే ప‌డ‌డంతో ఆ పార్టీ ఇప్ప‌ట‌కీ కోలుకునే ప‌రిస్థితి లేదు. విభ‌జ‌న త‌ర్వాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీచేసిన కాంగ్రెస్‌కు ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో డిపాజిట్లు వ‌చ్చాయో భూత‌ద్దంలో పెట్టి వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌ట‌కీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మూలాలు అక్క‌డ‌క్క‌డా ఉన్నా ? పార్టీని న‌డిపించే నాయ‌కుడే స‌రైన వాడు లేకుండా పోయాడు. […]

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క‌న్నేసిన ఇద్ద‌రు టాప్ డైరెక్ట‌ర్స్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జై ల‌వ కుశ సినిమాలో న‌టిస్తున్నాడు. ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ఫేం కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తోన్న ఈ సినిమాను ఏక‌ధాటిగా జ‌రిగే షెడ్యూల్‌లో షూటింగ్ ఫినిష్ చేసి సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ఇద్ద‌రు టాప్ […]

పెద్ద‌ల ఆశ‌ల‌కు బీజేపీ నేత‌ల‌ గండి

తెలంగాణ బీజేపీలో లుక‌లుక‌లు బ‌య‌టప‌డ్డాయి. ఆధిప‌త్య పోరు ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని ప‌రుగు పెట్టించాల్సిన ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య అభిప్రాయ‌బేధాలు పార్టీ అధిష్ఠానానికి త‌ల‌నొప్పిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ల‌క్ష్మ‌ణ్‌, శాస‌నాస‌భా ప‌క్ష నేత కిష‌న్ రెడ్డి కేంద్రాలుగా రెండు ప‌వ‌ర్ హౌస్‌లు ఏర్ప‌డుతు న్నాయ‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని అధిష్ఠాన పెద్ద‌లు ఆశ‌లు పెట్టుకుంటే.. వీరు ఆ ఆశ‌ల‌కు […]

2019కి టీడీపీలో సీనియ‌ర్లు అవుట్‌

తెలుగు దేశం పార్టీని త‌మ భుజ స్కందాల‌పై మోసి.. ఈ స్థాయికి చేర్చిన సీనియ‌ర్ల శ‌కం ఇక ముగిసిన‌ట్టే అనే గుస‌గుస‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్ర‌బాబు కూడా వీరికి ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీలో యువ నాయ‌క‌త్వం పెర‌గ‌బోతోంద‌నే సంకేతాలు.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ద్వారా స్ప‌ష్టం చేశారు చంద్రబాబు! అంతేగాక 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి అంతా చిన‌బాబు లోకేష్ సార‌థ్యంలోకే వెళ్ల‌వ‌చ్చ‌నేది కూడా స్ప‌ష్ట‌మ‌వుతున్న త‌రుణంలో.. ఇక సీనియ‌ర్ల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నే […]

ఆర్‌కే న‌గ‌ర్‌లో గెలుపు వారిదే..

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆర్కే న‌గ‌ర్‌లో గెలుపు కోసం డ‌బ్బులు విచ్చ‌ల విడిగా ఖ‌ర్చుచేస్తున్నాయి రాజ‌కీయ పార్టీలు! అటు అన్నాడీఎంకే, ఇటు దీప వ‌ర్గం, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం, డీఎంకే, బీజేపీ, ఇలా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఇక్క‌డ గెలుపు ప్ర‌తిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిని వ‌రించ‌బోతోందనే అంశంపై నిర్వ‌హించిన స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఈ ఎన్నిక‌లో డీఎంకే విజ‌యం […]

వైసీపీలో స‌మ‌ర్థుల‌కు ప‌ద‌వులు? మ‌రి టీడీపీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్టు బాబు..!

మంత్రి వ‌ర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చోటు క‌ల్పించ‌డంపై సీఎం చంద్ర‌బాబు ఎట్ట‌కేలకు స్పందించారు. అంతేగాక ఇక్కడొక స‌రికొత్త లాజిక్‌ను బ‌య‌ట‌పెట్టారు. దీంతో ఇక వైసీపీ విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టిగా సమాధానం చెప్పార‌ని టీడీపీ నేత‌లు పైకి చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ట‌. పార్టీని ఎంతో కాలంగా న‌మ్ముకుని ఉన్న సీనియ‌ర్లు స‌మ‌ర్థులు లేరా? అనే ప్ర‌శ్న ఇప్పుడు వారిలో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించ‌న‌వారే స‌మ‌ర్థులా? మేము కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్లు […]

నాగ‌బాబుకు జ‌న‌సేన ఎంపీ టిక్కెట్టు..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు మ‌రో బ్ర‌ద‌ర్ తోడు కానున్నాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రెండో సోద‌రుడు నాగ‌బాబు జ‌న‌సేన‌లో ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి గ‌త కొద్ది రోజుల వ‌ర‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ పేరు చెపితేనే నాగ‌బాబు మండిప‌డేవాడు. మెగా హీరోల ఫంక్ష‌న్ల‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్ చేసే అరుపులు, కేక‌ల‌పై నాగ‌బాబు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌ను తాము ప్ర‌తి ఫంక్ష‌న్‌కు పిలుస్తామ‌ని…ప‌వ‌న్ త‌మ ఫంక్ష‌న్ల‌కు ఎందుకు రావడం లేదో […]

బీజేపీ ఆప‌రేష‌న్ ” రెడ్డి ” స్టార్ట్‌

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ దూకుడుకు ప‌గ్గాలు వేసేందుకు బీజేపీ అదిరిపోయే స్కెచ్‌తో ఉందా ? 2019లో బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం లేదా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌తో ఉందా ? ఇందుకోసం ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌క్కా వ్యూహం ప‌న్నుతున్నారా ? అంటే తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల ఇన్న‌ర్ క‌థ‌నాల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. తెలంగాణ‌లో సాధారణ ఎన్నికలు రెండేళ్లుండగానే పార్టీల్లో కదలిక మొదలైంది. ఉన్న నాయకత్వానికి.. కొత్త నాయకత్వాన్ని జత […]

కేటీఆర్ కేబినెట్‌లో మంత్రిగా క‌విత‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీగా పార్ల‌మెంటులో తెలంగాణ వాణి బ‌లంగానే వినిపిస్తున్నారు. ఓ లేడీ అయ్యి ఉండి తెలంగాణ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌పై ఆమె లోక్‌స‌భ‌లో త‌న వాగ్దాటిని బ‌లంగానే వినిపిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే క‌విత‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని దాదాపు యేడాది కాలంగా ఒక్క‌టే ప్ర‌చారం జ‌రిగింది. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరుతుంద‌ని…మోడీ టీఆర్ఎస్‌కు రెండు మంత్రి ప‌ద‌వులు కూడా ఆఫ‌ర్ చేశార‌ని..అందులో ఒక‌టి క‌విత‌కేన‌న్న ప్ర‌చారం […]