నారా-నందమూరి కుటుంబాల మధ్య దూరం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇటీవల సీఎం చంద్రబాబు విజయవాడలో నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశానికి నందమూరి హరికృష్ణ హాజరై.. బావతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో విభేదాలు తగ్గాయని అంతా భావించారు. కానీ చంద్రబాబు తనయుడు లోకేష్.. మంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు కల్యాణ్ రామ్ హాజరైనా.. జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు చంద్రబాబు కొత్తగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశానికి కూడా ఎన్టీఆర్ రాకపోవడంతో […]
Author: admin
పవన్ ట్విట్టర్…విమర్శలు విన్నపాలు కితాబులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా టీడీపీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.అంటే విరుచుకుపడిపోయాడా అని అడిగిగితే అవును విరుచుకుపడినట్టే పడి అంతలోనే తనకి బాగా ఇష్టమైన అర్థిస్తున్నాను..విన్నవిస్తున్నాను అంటూ ముక్తాయించేసాడు ఎప్పటిలాగే. ఇంతకీ విషయం ఏంటంటే..ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చిన సందర్భంలో సదరు టీడీపీ ఎంపీ ల తీరును జనసేనాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించేశాడు.సభలో టీడీపీ ఎంపీ అశోక గజపతి […]
చంద్రబాబు మాటల్లో పేద.. చేతల్లో రాజు
హంగులూ ఆర్భాటాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమడ దూరంలో ఉంటారనే విషయం ఆయన మాటలు, దుస్తులను బట్టి తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించుకున్న ఇల్లు చూస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక హంగులతో విశాలమైన ప్రాంగణంలో.. కట్టుకున్న ఈ అద్భుతమైన రాజ్‌మహల్ గురించి రోజుకో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తుంది. అదేంటంటే.. సినిమాల్లో చూసిన విధంగా.. కారుతో నేరుగా ఫస్ట్ ఫ్లోర్‌లోకే వెళ్లిపోవచ్చట. `నా చేతికి వాచీ ఉండదు. […]
రోజా ఇలాకాలో టీడీపీకి లీడర్ లేడా..!
సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పించి.. నిత్యం వార్తల్లో నిలిచే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గమైన నగరిలో టీడీపీ ప్రాభవం కోల్పోతోంది. అక్కడ అధికారంలో లేకపోయినా.. నిధులు మంజూరు చేసుకుని పార్టీ పటిష్టతపై దృష్టిసారించాల్సిన నేతలు.. కేవలం విమర్శలకే పరిమితమవుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన.. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎమ్మెల్సీ అయినా.. ఇప్పటికీ జిల్లాల్లో కీలకమైన పదవులు భర్తీ చేయడంలో వెనకడుగు వేస్తున్నారు. నాయకుల నిర్లక్ష్యంతో […]
అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేష్
టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచి చంద్రబాబు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే వరకూ ఎన్టీఆర్ కేంద్రంగానే రాజకీయాలన్నీ జరిగేవి. ఇక చంద్రబాబు వచ్చాక.. పార్టీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడింది. ఎవరైనా ఆయన ద్వారానే ఎన్టీఆర్‌ను కలిసేవారు. ఎన్టీఆర్ హయాం తర్వాత చాలా ఏళ్లు చంద్రబాబు కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి.. ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇప్పుడు ఆయన తనయుడి ఎంట్రీతో మళ్లీ ఆనాటి రోజులు మళ్లీ పార్టీలో కనిపిస్తున్నాయి. ఇప్పుటి వరకూ తెర వెనుకే ఉన్న నారా లోకేష్.. చంద్రబాబు […]
చంద్రబాబుకు మోడీ ప్రయారిటీ పెరుగుతోందా..!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల విజయం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు బలంగా వినిపించాయి. ఇక చంద్రబాబును మోడీ పక్కన పెట్టడం ఖాయమని, మోడీ వద్ద బాబు ప్రాధాన్యం తగ్గిపోతుందనే ప్రచారం జోరుగా వినిపించింది. కానీ అలా అన్నవారే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు-మోడీ సాన్నిహిత్యం మళ్లీ చిగురించిందనడానికి ఎన్డీయే పక్షాల సమావేశం నిదర్శనంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో అభ్యర్థి ఎంపికపై మోడీ.. చంద్రబాబు సలహాలు తీసుకోవడం ఆసక్తికరం గా […]
వైసీపీ ఎంపీగా కొమ్మినేని… ఎక్కడో తెలుసా..!
కొమ్మినేని శ్రీనివాసరావు పేరు చెపితే తెలుగు న్యూస్ ఛానెల్స్ చూసే వారిలో ఆయన తెలియని వారు ఉండరు. తెలుగు మీడియా వార్తా రంగంలో తన విశ్లేషణలతో కొమ్మినేని సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉంటూ సీనియర్ జర్నలిస్టుగా ఉన్న ఆయన తెలుగులో చాలా టాప్ మీడియా సంస్థల్లో పనిచేశారు. ఎన్టీవీలో ఉంటోన్న ఆయన కొద్ది రోజుల క్రితం అనూహ్య పరిణామాలతో ఆ ఛానెల్ నుంచి బలవంతంగా బయటకు నెట్టబడ్డారు. ఆ […]
హోదా కంటే పునర్విభజనే బాబుకు ఎక్కువా..?
`నియోజకవర్గాల పునర్విభపన ఎప్పుడు చేస్తారు? వీలైనంత త్వరగా దీనిని చేపట్టండి` అంటూ కేంద్ర పెద్దలను కలిసినప్పుడల్లా ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే వారిని సర్దిచెబుతున్నారు. ఆయనకు కుదరకపోతే.. టీడీపీ ఎంపీలతో కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మంతనాలు జరిగేలా చూస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు జరిగి తీరాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. హోదా విషయంలో ఇంతట గట్టిగా ప్రయత్నించని ఆయన.. నియోజకవర్గాల పునర్విభజనపై పడుతున్న ఆరాటం చూసి అంతా ఆశ్చర్యపడుతున్నారు. హోదా విషయంలో ఇంతలా […]