రాజ్‌తరుణ్ – హెబాపటేల్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం కుమారి 21 ఎఫ్, ఈడోరకం – ఆడోరకం సినిమాలతో చూశాం. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో అంధగాడు సినిమా తెరకెక్కింది. ప్రముఖ స్టోరీ రైటర్ వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమాకు మంచి టాక్ రావడంతో రాజ్ తరుణ్ కెరీర్‌లోనే బెస్ట్ […]
Author: admin
మంత్రి ఆదికి లోపలో శత్రువు…బయటో శత్రువు
మంత్రి ఆదినారాయణరెడ్డిది మామూలు లక్ కాదు. కడప జిల్లాలో జగన్‌కు అత్యంత నమ్మినబంటుగా ఉన్న ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి జంప్ చేయడం, ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డి హవా ఓ రేంజ్‌లో కంటిన్యూ అవుతోంది. జిల్లా రాజకీయాలను ఆయన శాసిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డికి ఇరువైపుల నుంచి మద్దెలదరువు తప్పేలా లేదు. ఆయన లోపలో శత్రువు, బయటో శత్రువును ఎదుర్కోకతప్పేలా లేదు. జమ్మలమడుగు టీడీపీ రాజకీయాల్లో […]
వైసీపీ లో ఘంటా పొలిటికల్ ఫ్యూచర్ ఎటు..!
ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఘంటా మురళీ రామకృష్ణ (మురళీ) అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ సమైక్యాంధ్ర రాజకీయాల్లో కాకలు తీరిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావును ఓడించిన ఓ సంచలన వ్యక్తిగా మాత్రం ఘంటా మురళీ తెలుసు. అతి సామాన్యుడైన మురళీ 2004లో ఐదుసార్లు గెలిచిన తలపండిన రాజకీయవేత్త, దివంగత మాజీ మంత్రి కోటగిరిని ఓడిచి పెద్ద సంచలనం సృష్టించారు. 2004లో చింతలపూడి ఎమ్మెల్యే అయిన మురళీ ఆ తర్వాత అది రిజర్వ్ కావడంతో కిరణ్‌కుమార్ […]
టీటీడీపీలో మరో ఎమ్మెల్యే జంప్..?
రుణ శేషం..శత్రు శేషం ఉండరాదనేది ఓ నానుడి. ఇదే విధానాన్ని తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అమలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీనీ కోలుకోలేని దెబ్బతీసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీకి మిగిలిన ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి లాక్కునేందుకు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్లాన్ వేసిందన్న చర్చలు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణలో టీడీపీని దాదాపు ఖాళీ చేసేసిన గులాబీ పార్టీ తాజాగా అక్కడ పసుపు పార్టీని అందరూ మర్చిపోయేలా చేసే పనిలో బిజీగా ఉన్నట్టు […]
12 మంది ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తే అటు పక్కన ఎలాంటి వారున్నా ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఏపీలో నవనిర్మాణ దీక్షను ప్రారంభించాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్షకు 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు డుమ్మా కొట్టారు. తాను ఎంతో సీరియస్‌గా ఈ దీక్షలో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గోవాలని పిలుపునిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తన మాట పట్టించుకోకపోవడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమరావతిలోని తన […]
సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మహేష్
తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్ ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న ప్రిన్స్ మహేష్‌బాబు స్పైడర్ సినిమా టీజర్ వచ్చేసింది. మహేష్‌బాబు – క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ టీజర్ వ్యూస్ విషయంలో మహేష్‌బాబుకు సౌత్ ఇండియాలోనే టాప్ ర్యాంకు సాధించిపెట్టింది. స్పైడర్ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 6.3 మిలియన్ వ్యూస్‌తో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది. […]
తెలంగాణ భూ కుంభకోణంలో కేసీఆర్ మంత్రి
తెలంగాణలో భూ అక్రమార్కులు చెలరేగారని, సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతిలో ఆరితేరిపోయి.. అడ్డగోలుగా సహాయం చేశారని వార్తలు అందాయి. ఈ వ్యవహారంలో టీ మంత్రుల హస్తం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. దీంతో తీవ్రంగా ఫైరైన సీఎం కేసీఆర్.. వెంటనే ఏసీబీని రంగంలోకి దింపారు. అసలు విషయం ఏంటో అంతు తేల్చాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేశారు. అధికారులు భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారని, అవినీతిలో పేట్రేగిపోయారని […]
వాళ్లను వదలేసి తప్పుచేశాం… టీ-బీజేపీలో అంతర్మధనం
తెలంగాణలో బీజేపీకి ఐదుగురంటే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీలోకి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్లెవరు చేరలేదు. అయితే ఈ విషయంలో తాము ముందుగా మేల్కొని ఉంటే… టీఆర్ఎస్ చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే చేరి ఉండేవాళ్లని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా కామనైపోయాయని… కానీ ఈ విషయంలో తాము చాలా ఆలస్యంగా మేల్కొన్నామని టీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ కంటే ముందుగానే టీడీపీకి చెందిన […]
తెలంగాణ మీడియాలో టీడీపీకి ఇంపార్టెన్స్ లేదా..!
తెలంగాణలో టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా.. కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్న రేవంత్ రెడ్డి.. గత కొన్నాళ్లుగా మరింత దూకుడుగా ఉన్నాడు. కేసీఆర్‌పై విమర్శలు, ఆరోపణలు వాడి వేడిని మరింత పెంచారు. ఇటీవల ముగిసిన మహానాడు తర్వాత ఈ వాడి మరింత పెరిగింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పడు ప్రధాన సమస్య.. టీడీపీకి మీడియా కవరేజ్ ఘోరంగా తగ్గిపోయిందట! తమ పక్షానే ఉంటాయని భావించిన ఆ రెండు పత్రికలు […]