సినిమా ఎన్ని రోజులు తీసినా.. అందుకు తగిన ప్రచారం కల్పించకపోతే ఆ ప్రభావం సినిమా రిజల్ట్‌పై స్పష్టంగా కనిపిం చే రోజులివి. మార్కెటింగ్ చుట్టూనే సినిమా అంతా తిరుగుతున్న ఈ సమయంలో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ వీలైనంతగా ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. అల్లు అర్జున్, పూజా హెగ్దే కాంబినేషన్‌లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం `డీజే`. ఈ చిత్ర రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ నిర్మాతలకు టెన్షన్ మొదలవుతోందట. ముఖ్యంగా పబ్లిసిటీ విషయంలో […]
Author: admin
చంద్రబాబు తీరుతో నేతల్లో ఆందోళన
పార్టీ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా.. ఆచరణలో మాత్రం వాటిని పట్టించుకోవడం లేదా? సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో ఏర్పడుతున్న జాప్యం వల్ల పార్టీకి కొంత నష్టం కలుగుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన తర్వాత.. పార్టీ శ్రేణుల్లో ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. పార్టీలో అసంతృప్తుల సంఖ్య […]
సీబీఐ దర్యాప్తుకి `నో` వెనుక రీజన్ ఇదేనా?
ఏదైనా కుంభకోణం బయటపడినా, ఆరోపణలు వచ్చినా వెంటనే `సీబీఐకి కేసు అప్పగించాలని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా.. ఎంత గందరగోళం సృష్టించినా.. వాటన్నింటినీ ఏమాత్రం ఖాతరు చేయరు తెలంగాణ సీఎం కేసీఆర్. మొన్నటికి మొన్న ఓటుకు నోటు కేసులో, గ్యాంగ్ స్టార్ నయీం కేసులోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఇప్పుడు మియాపూర్ భూకుంభకోణం లోనూ కేసీఆర్ దీనినే ఫాలో అవుతున్నారు. కేసును సీబీఐకి అప్పగించకుండా ఆ వివరాలను తన దగ్గరే ఉంచుకోవడం వెనుక వ్యూహం వేరే ఉందని పార్టీలో […]
టీఆరెస్ మంత్రులకు పాతవి బోర్ కొట్టాయా లేక భయం పట్టుకుందా!
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. కేవలం అభివృద్ధి, అభ్యర్థుల పనితీరు ఆధారంగానే గెలుపోటములు ఉంటాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు కేసీఆర్ సర్వేల్లో మంచి మార్కులే ఉన్నా ఎక్కడో చిన్న అనుమానం ఉండడంతో వారు వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో బిజీ […]
బిగ్ బాస్ షో వెనక ఎన్టీఆర్ టార్గెట్ అదే
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్టార్ మా ఛానెల్లో బిగ్ బాస్ షో చేస్తున్నాడు. టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ ఇంత తక్కువ వయస్సులోనే బుల్లితెర మీదకు ఎందుకు వస్తున్నాడబ్బా ? అన్న డౌట్లు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ షో చేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాక, తాజాగా లుక్ రిలీజ్ చేశాక అంచనాలు రోజు రోజుకు మరింత రెట్టింపు అవుతున్నాయి. పైగా ఇటీవల తెలుగు బుల్లితెర మీద ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు […]
టీడీపీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుందా..!
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. ఈ మూడేళ్లలో పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఆ పార్టీలో లుకలుకలు పార్టీ ఆవిర్భవించిన ఈ మూడున్నర దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా ఉన్నాయి. పార్టీలో ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వచ్చిన జంపింగ్ జపాంగ్‌ల దెబ్బతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే 2019 ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం కలగక మానదు. అన్ని జిల్లాల్లోను మంత్రులు, నాయకుల మధ్య […]
బాబిని టెన్షన్ పెడుతోన్న ఎన్టీఆర్
ఇటీవల టాలీవుడ్‌లో ట్రెండ్ మారుతోంది. స్టార్ హీరోలందరూ బాలీవుడ్‌లో లాగా తమ సినిమాల రిలీజ్ డేట్లను ముందుగానే ప్రకటిస్తున్నారు. అనుకున్న టైంకు కాస్త అటూ ఇటూగా సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకేసారి ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ వచ్చే అడ్వాన్స్ ఉండడంతో సినిమా సినిమాకు మధ్య ఒకటి లేదా రెండు వారాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సైతం తన కొత్త సినిమా జైలవకుశ విషయంలో […]
నంద్యాలలో టీడీపీకి కష్టాలు..!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ఈ రోజు వైసీపీలో చేరడంతో ఇక్కడ బలాబలాలు మారుతున్నాయి. నిన్నటి వరకు ఇక్కడ టీడీపీ మూడు గ్రూపులుగా ఉంది. ఈ మూడు గ్రూపుల్లో ఒకరికి మరొకరితో అస్సలు పొసగలేదు. భూమా వర్గం, శిల్పా వర్గం, మాజీ మంత్రి ఫరూఖ్ ఇలా వీరు వేర్వేరు గ్రూపులుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ముగ్గురు […]
జ్యోతి.. ఈనాడును మించుతోందా?
ఏపీలో ఇప్పుడు ఇదే టాపిక్ హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా లార్జెస్ట్ సెర్క్యులేషన్‌తో ఎదురు లేకుండా ముందుకు సాగుతున్న ఈనాడుకు ఇప్పడు జ్యోతి రూపంలో చాపకింద నీరులా పోటీదారు పేట్రేగిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్ నేతృత్వంలోని సాక్షి ఈనాడుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే, రానురాను రామోజీ దెబ్బకి మెత్తబడి ఎలాంటి పోటీ గీటీ లేకుండానే తన మానాన తను పని కానిస్తోంది. కానీ, ఆర్కే నేతృత్వంలోని ఆంధ్రజ్యోతి […]