చంద్రబాబు ప్లాన్ – బీ?

భూమా అఖిలప్రియ.. మాజీ మంత్రి.. తెలుగుదేశం పార్టీ నాయకురాలు.. తల్లిదండ్రలు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి భూమా నాగిరెడ్డి మరణించడంతో ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధికారం కోల్పోయింది.. ఈమె మాజీ మంత్రిగా మిగిలింది. అయితే అధికారం లేకపోయినా భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో హవా ఉండేది. భూమా నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన భార్య […]

మామకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్.. అల్లుడికైనా హిట్ ఇస్తాడా..!

కోలీవుడ్లో విష్ణువర్ధన్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ గా ఆయనకు పేరుంది. తమిళ బిల్లాను తెరకెక్కించింది విష్ణువర్ధనే. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ఒకే ఒక్క సినిమా పంజా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని విష్ణువర్ధన్ స్టైలిష్ గా చూపించాడు. ఈ సినిమాలోనే […]

భట్టి సరే.. మోత్కుపల్లి ఎందుకొచ్చినట్టు?

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన దళితబంధు సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. అయితే ఈ మీటింగుకు వచ్చిన వారంతా ఆ ఇద్దరు నాయకులను ప్రత్యేకంగా చూశారు. అరె.. వీరు కూడా వచ్చారా అన్నట్లున్నాయి వారి చూపులు. ఆ ఇద్దరూ ఎవరంటే.. ఒకరు మల్లు భట్టి విక్రమార్క, మరొకరు మోత్కుపల్లి నర్సింహులు. దళితబంధు పథకాన్ని రాష్ట్రంలో విస్తరించడంపై ఈ సమీక్ష నిర్వహించారు. మరో ఐదు మండలాల్లో (వేర్వేరు నియోజకవర్గాల్లో) అమలు చేయాలని సర్కారు […]

మరో సినిమా లైన్లో పెట్టిన రామ్.. దర్శకుడు ఎవరంటే..!

తెలుగులో అపజయం ఎరుగని డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం ఆయన వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్- 2 సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉంది. తాజాగా హీరో రామ్ పోతినేని -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు […]

డేట్ ఫిక్స్ అయినట్టేనా..మరోసారి వాయిదా పడుతుందా?

ఏపీలో నెలకొన్నథియేటర్ ఇబ్బందులను, పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు చిరంజీవి అండ్ టీమ్ ఈనెల 20న సీఎం జగన్ తో సమావేశమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశానికి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీఎం తో సమావేశం మంత్రి పేర్ని నాని కూడా ఖరారు చేశారట. మంత్రితో చిరంజీవి నిరంతరం టచ్ లోఉంటున్నారట. ఈ విషయంపై నాని కూడా సజ్జలతో మాట్లాడారని సమాచారం. గతంలోనే ఈ సమావేశం జరగవలసి ఉంది. సెప్టెంబర్ 4వ […]

నితిన్ మళ్లీ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా.. మాస్ మూవీ హిట్ ఇచ్చేనా..!

తేజ దర్శకత్వంలో 2002లో విడుదలైన సినిమా జయం. ఈ సినిమా ద్వారానే నితిన్ హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ తర్వాత ఆయన హీరోగా నటించిన రెండో సినిమా దిల్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. సై మూవీ వరకూ నితిన్ సినీ ప్రస్థానం బాగానే సాగింది. ఆ తర్వాత నుంచి ఆయన కెరీర్ ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది.అందుకు కారణం నితిన్ తీసుకున్న […]

విశ్వక్ సేన్ చేయలేనిది గోపిచంద్ చేశాడా.. థియేటర్లు తెరుచుకున్నట్లేనా..!

కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత.. థియేటర్లు తెరుచుకోగా సాయి తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటరూ.. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకులు కూడా థియేటర్ల వైపు రావడానికి ఆసక్తి చూపించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కూడా థియేటర్లు తెరుచుకోగానే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలి వస్తారని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. థియేటర్లు తెరుచుకొని సుమారు రెండు […]

కేసీఆర్ కల ఇలా తీరుతుందేమో!

పరిశుభ్రమైన హుస్సేన్ సాగర్ ను హైదరాబాదు వాసులకు అందించాలనేది కేసీఆర్ కల. కానీ.. ఆ సాగర్ ఎప్పటికప్పుడు ఘోరంగా తయారైపోతుండడానికి ఉండే అనేక కారణాలలో వినాయక నిమజ్జనం కూడా ఒకటి. ఏటా వందలకొద్దీ వినాయక విగ్రహాలను ఈ హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసేస్తుండడం.. దాని పరిశుభ్రతకు పెద్ద సవాలు. ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలు, సింథటిక్ రంగులు పూసిన, ఇనుప కమ్మీలు వాడి తయారుచేసిన విగ్రహాలు. ఇవన్నీ కూడా ఏ […]

ఇలాంటోళ్లకు వత్తాసు ఉంటే వైసీపీ పరువు పోదా?

అమ్మాయిలను ట్రాప్ చేసి పోర్న్ వీడియోలు షూట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. హత్యకు కుట్ర చేసి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయిన వాడు.. హత్యకేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. అయిన వ్యక్తిని వెనకేసుకు రావడానికి ఎలాంటి రాజకీయ నాయకుడు అయినా జంకుతారు. కానీ.. ఇప్పుడు ఇలాంటి అన్ని తప్పులూ చేసిన వ్యక్తిని పోలీసుల చెరనుంచి బయటకు తీసుకురావడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఇలాంటి వారికి వత్తాసు నిలిస్తే మొత్తంగా పార్టీ పరువే పోతుందనే భయం వైసీపీ వారిలో […]