కంచుకోటల్లాంటి నియోజకవర్గాలని చేతులారా టిడిపి నేతలు నాశనం చేస్తున్నారని చెప్పవచ్చు. అంతర్గత పోరుతో గెలుపు అవకాశాలు ఉన్న సీట్లని ఓటమి దిశగా తీసుకెళుతున్నారు. అలా ఓటమి దిశగా వెళుతున్న సీట్లలో చింతలపూడి కూడా ఒకటి. ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోట. అందులో ఎలాంటి డౌటే లేదు. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ టిడిపి జెండా ఎగిరింది. కానీ ఆ తర్వాత నుంచి గ్రూపులు రావడం..సీటు కోసం పోటీ పడే నేతలు పెరగడంతో రచ్చ మొదలైంది. గత ఎన్నికల్లో […]
Author: Krishna
కన్నా జంపింగ్ ఫిక్స్..పార్టీ అదే.!
బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారడం దాదాపు ఖాయమైంది. గత కొంతకాలంగా బిజేపికి దూరంగా ఉంటున్న కన్నా..ఈ నెలలోనే వేరే పార్టీలోకి జంప్ చేయడం ఖాయమని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన కన్నా..రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి వెళ్లాలని చూశారు. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఉండగా..అప్పుడు జగన్‌ని కలిసి వైసీపీలో చేరాలని అనుకున్నారు. కానీ కేంద్రం పెద్దలు..వైసీపీలో కన్నా చేరికకు బ్రేకులు వేశారు. అదే సమయంలో బిజేపిలోకి […]
జగ్గంపేటలో బాబు జోరు..చంటిబాబుకు చెక్?
మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనూహ్యంగా రోడ్ షో చేశారు. కందుకూరు, గుంటూరు ప్రమాదాల తర్వాత బాబు కుప్పంకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ రోడ్ షో చేయకుండా పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు. దీంతో బాబు కాలినడకనే కుప్పంలో తిరిగారు. ఈ క్రమంలోనే బాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. కానీ ఇక్కడ రోడ్ షోలకు పర్మిషన్ రావడంతో బాబు..జగ్గంపేట స్థానంలో రోడ్ […]
వెనుకబడిన కొడాలి..గుడివాడలో టీడీపీకి ఛాన్స్.!
ఎమ్మెల్యేగా ఉంటూ గడపగడపకు తిరగడంలో కొడాలి నాని విఫలమయ్యారు. పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరగడం లేదు..ఆ విషయం స్వయంగా కొడాలి నాని సైతం ఒప్పుకున్నారు. తాజాగా జరిగిన వర్క్ షాప్ లో జగన్..తమకు క్లాస్ పీకారని చెప్పుకొచ్చారు. తన లాంటి బద్ధకస్తులకు జగన్ గట్టిగానే క్లాస్ ఇచ్చారని, ఇకనైనా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారని అన్నారు. అంటే ప్రజల్లో తిరగడం లేదనే కొడాలి ఒప్పుకున్నారు. పైగా అధికారంలోకి వచ్చాక గుడివాడకు కొడాలి చేసిందేమి కనబడటం లేదు. ఎందుకంటే గత […]
కోటలో పట్టు తప్పుతున్న ‘ఫ్యాన్’..!
వైసీపీకి ఉన్న కంచుకోటల్లో కర్నూలు అసెంబ్లీ కూడా ఒకటి. ఈ కర్నూలు కోటలో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది..మరి ఈ సారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా? అంటే అదే కొంచెం కష్టమనే పరిస్తితి. ఎందుకంటే ఈ సారి కర్నూలు కోటలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అసలు గత రెండు ఎన్నికలే ఏదో బోర్డర్ లో గెలిచింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి […]
దర్శి సీటుపై నో క్లారిటీ..బాబు ప్లాన్ ఏంటి?
గత మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితం వచ్చిన మున్సిపాలిటీల్లో దర్శి కూడా ఒకటి. రాష్ట్రమంతా వైసీపీ హవా నడుస్తుంటే..దర్శిలో మాత్రం టిడిపి సత్తా చాటింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టిడిపి నేతలు కలిసికట్టుగా పనిచేసి దర్శి మున్సిపాలిటీని గెలిపించుకున్నారు. టిడిపి విజయానికి ఇంచార్జ్ గా పనిచేసిన పమిడి రమేష్ కూడా బాగానే కృషి చేశారు. అలా పార్టీ కోసం పనిచేసిన రమేష్.. తర్వాత ఇంచార్జ్ పదవినే వదులుకున్నారు. ఎందుకంటే దర్శి సీటు విషయం చంద్రబాబు తేల్చకపోవడంతో..రమేష్ సైడ్ […]
కైకలూరులో జనసేనకు లైన్ క్లియర్..టీడీపీ తేల్చేసిందా?
పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ ఏ ఏ సీట్లు ఇస్తుందనే అంశంపై ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. పొత్తు అధికారికంగా ఫిక్స్ కాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో జనసేనకు టిడిపి కొన్ని సీట్లు ఇస్తుందని చెప్పి..ఆ సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎప్పటినుంచో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటు జనసేనకు దక్కుతుందని ప్రచారం ఉంది. మొదట నుంచి పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే అంతా అనుకుంటున్నారు. […]
మూడు కాదు..ఒకటే రాజధాని..వైసీపీ స్ట్రాటజీ!
అధికార వైసీపీ ఏది చేసిన దాని వెనుక రాజకీయం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి కార్యక్రమం వెనుక రాజకీయ ఉద్దేశం ఉంటుంది..ఓ స్ట్రాటజీ ఉంటుందనే చెప్పాలి. ఆ స్ట్రాటజీలో భాగంగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టిడిపి అధికారంలో ఉండగా అమరావతి రాజధానికి ఓకే చెప్పిన జగన్..అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నారు. అమరావతి శాసనరాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని చెప్పారు. అలా మూడు ప్రాంతాలు అభివృద్ధి […]
ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే రాజీనామాలే..బాబుకు వార్నింగ్!
రాజేష్ మహాసేన టీడీపీలో చేరే విషయంలో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాజేష్ టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. అటు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 15న చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో 16న చంద్రబాబు సమక్షంలో రాజేశ్ టీడీపీలో చేరనున్నారు. అయితే రాజేశ్ మహాసేనని టీడీపీలో చేర్చుకోవద్దని, జిల్లాలోని కొందరు తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకు లెటర్ రాశారు. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి పనిచేశారని..వైసీపీ కోసం […]