అత్తమాస్ కిచెన్ పై విమర్శలకు ఒకే ఒక్క సమాధానంతో చెక్.. మ్యాటర్ ఏంటంటే..?!

మెగా కోడలు ఉపాసన, సురేఖలు కలసి అత్తమాస్ కిచెన్ పేరుతో రీసెంట్గా కొత్త బిజినెస్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. క్వాలిటీ ప్రొడక్ట్స్ ను అందిస్తూ.. తమ ప్రొడక్ట్స్ తో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆన్లైన్ వేదికగా బిజినెస్‌ను చేస్తున్న ఈ అత్త‌మ్మస్‌కిచెన్ పేజ్‌పై తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోతో చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆవకాయ సీజన్ కావడంతో సురేఖ తన అత్తమ్మ అంజనాదేవి ఆధ్వర్యంలో ఆవకాయ చేస్తుండగా ఆ వీడియో క్లిప్ ను సేవ్ చేసి ఉపాసన షేర్ చేసిన సంగతి తెలిసిందే.

Womens Day: Upasana, Surekha,Anjana Devi on Atthamma Kitchen evolution -  Telugu News - IndiaGlitz.com

అలాగే సురేఖ తోటికోడ‌లు వ‌రుణ్ అమ్మ పద్మజ, భార్య లావణ్య ఇద్దరు కలిసే ఆవకాయ పడుతున్న ఫోటోలను కూడా అత్తమ్మస్ కిచెన్ ఇన్‌స్టా హ్యాండిల్ పేజ్ షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో వీరిద్దరి చేతికి గ్లౌజులు లేకుండా.. హెయిర్ కు కనీసం క్యాప్ ఐన లేకుండా ఆవకాయ పడుతూ కనిపించారు. దీంతో నెటింట ట్రోల్స్ మొదలయ్యాయి. కనీసం తలకి క్యాప్ పెట్టుకొని అయినా పచ్చడి పెట్టాల్సింది.. అందులో వెంట్రుకలు వస్తే, అందులో క్వాలిటీ లో తేడా వస్తే.. ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ పలువురు కామెంట్స్ చేస్తూ వచ్చారు.

Lavanya Tripathi gets trolled for her recent picture in Athammas kitchen vn  | Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వల్ల మెగా బిజినెస్ పై విమర్శలు.. అసలు  ఏమైందంటే.. News in Telugu

దీనిపై ఎన్నో ట్రోల్స్ కూడా వెలువడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన అత్తమ్మస్ కిచెన్.. ఒకే ఒక సమాధానంతో ఈ ట్రోల్స్ అన్నింటికీ చెక్ పెట్టింది. అది వాళ్ళ ఇంటి కోసం పెట్టుకుంటున్న పచ్చడి.. ఇది మా ప్రొడక్ట్స్ లో భాగం కాదు.. అత్త‌మ్మ‌స్ కిచెన్ వంట‌ల‌న్నింటికి హైయెస్ట్ స్టండ‌ర్డ్స్ మెయిన్‌టైన్ చేస్తుంది అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు అత్తమ్మస్ కిచెన్ ప్రొడక్ట్స్ పై వస్తున్న ట్రోల్స్‌కు ఒక్కసారిగా చెక్ పడింది.