” డబ్బుల కోసం అలాంటి పనులు చేశాను “… ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్…!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్లలో ప్రకాష్ రాజ్ ఒకడు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఈయన ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే చెప్పాలి. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రకాష్ రాజ్ పలుసార్లు వివాదాల్లో కూడా నిలుస్తూ వచ్చారు.

ఈయన ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించినటువంటి విషయాల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతూ వివాదాల్లో నిలుస్తూ ఉండేవారు. ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ” నేను ముందుగా సినిమాలకు ఎంపిక అయిన తర్వాతనే నన్ను తీసేసినటువంటి సినిమాలు సైతం ఉన్నాయి.

అలా సినిమాలలో నుంచి తీసేయడం వెనక పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతున్నాయనే సంగతి నాకు తెలుసు. అందుకే సినిమాల నుంచి నన్ను తీసేసిన పెద్దగా బాధపడలేదు. ఇక మరికొన్ని సినిమాలలో నా నటన ఓవర్ యాక్టింగ్ ల ఉందని చాలామంది నాతో చెబుతూ ఉన్నారు. నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్న అంటే నేను బాగా నటిస్తున్నానని అర్థం కదా. ఇక సరిగ్గా సినిమాలు లేక డబ్బుల కోసం పిచ్చి సినిమాలను చేశాను ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.