వామ్మో .. ఏంటిది బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఈ విధమైన కాంపిటీషన్ నెలకొంది . ఇదివరకు ఎప్పుడూ లేని రేంజ్ లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనలిస్టుల బిహేవియర్ ఉంటూ ఉండడంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు . కాగా మరి కొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ట్రోఫీ విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది . అయితే టాప్ ఫైవ్ లో అర్జున్ అంబటి – ప్రియాంక – అమర్దీప్ శివాజీ – పల్లవి ప్రశాంత్ ఉండబోతున్నారు.
అయితే బిగ్బాస్ ట్రోఫీ విన్ అవ్వడానికి ఒక్కొక్క రకమైన ప్లాన్స్ ఫాలో అవుతున్నారు . హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బయట పిఆర్ టీం లను మెయిన్ టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమర్ దీప్ ఫ్యాన్స్ ఒకరకంగా ప్రమోట్ చేస్తుంటే.. ప్రియాంక ఫ్యాన్స్ మరొక రకంగా ప్రమోట్ చేస్తున్నారు . శివాజీకి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అందుకే ఆయన గురించి ఎవరు పెద్దగా ట్రెండ్ చేయడం లేదు .
ఇక అర్జున్ అంబాటి విషయానికొస్తే ఆయన విన్నర్ అవుతాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇక ఆశలన్నీ పల్లవి ప్రశాంత్ పైనే పెట్టుకుని ఉన్నారు జనాలు. అయితే పల్లవి ప్రశాంత్ పిఆర్ టీం వెరైటీగా బిగ్ బాస్ ఓటింగ్ ని ప్రమోట్ చేస్తుందట . ఎవరైతే రైతుబిడ్డకు ఓటు చేస్తారో వాళ్లకు ఇంటింటికి వెళ్లి రైస్ బాగ్ అందజేస్తున్నారట. దీంతో పల్లవి ప్రశాంత్ పేరు నెట్టింట వైరల్ గా మారింది..!!