ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనే తేడా లేకుండా పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా పెళ్లి చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే లిస్టులోకి యాడ్ అవ్వనున్నాడు అడివి శేష్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా సుప్రియ యార్లగడ్డతో అడివి శేష్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ వార్తలపై వీరిద్దరూ ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినప్పటికీ.. వీరిద్దరూ తమ నిర్ణయం తాము తీసేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అక్కినేని ఇంట జరిగిన పలు ఫంక్షన్స్ లో ఫేవరెట్ స్టోరీలలో అడ్విషేస్ ఫ్యామిలీ పిక్స్ లో కనిపించడమే ఈ రూమర్స్ కు పెద్ద కారణం. ఇక ఇన్నేళ్లు వీళ్ళ పెళ్లి గురించి అక్కినేని ఫ్యామిలీ సైతం తమ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టుకుంది.
ఇప్పుడు సమాజంలో మారిన పద్ధతుల కారణంగా అక్కినేని ఫ్యామిలీ కూడా సుప్రియ రెండో పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అడవి శేష్ మంచి అబ్బాయి కావడంతో సుప్రియ లైఫ్ బాగుంటుందని ఆలోచించి వీరి పెళ్లికి ఒప్పుకున్నారట అక్కినేని ఫ్యామిలీ. అంతేకాదు వీరి నిశ్చితార్థం డిసెంబర్ 22న జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.