ఒక్క దెబ్బతో కుంభస్థలాన్ని కొట్టిన రష్మిక.. సినీ ఇండస్ట్రీలో కని విని ఎరుగని రికార్డ్..!

రష్మిక మందన్నా ..ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా రీసెంట్గా నటించిన యానిమల్ సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో ఆమె పేరు హైలెట్గా మారిపోయింది . నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో అంతస్థానాన్ని దక్కించుకోవాలి అంటే మామూలు విషయం కాదు . ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి ఎన్నో త్యాగాలు చేయాలి .

కానీ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిన అతి తక్కువ టైంలోనే హీరోయిన్ రష్మిక మందన్నా.. కుంభస్థలాన్ని కొట్టి స్పెషల్ క్రేజీ రికార్డ్స్ సొంతం చేసుకుంది . మన హీరోయిన్స్ ఎంతోమంది బాలీవుడ్ లో పాగా వేయాలని చూడగా సక్సెస్ కాలేకపోయారు . మరీ ముఖ్యంగా తాప్సి – రకుల్ ప్రీత్ సింగ్ – తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా బోల్తా పడ్డారు .

కానీ రష్మిక మందన్నా మాత్రం చాలా తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ అందుకొని .. బాలీవుడ్లో కనీ విని ఎరగని రికార్డ్స్ ను దక్కించుకుంది . అంతేకాదు రష్మిక ప్రజెంట్ బాలీవుడ్ లో నాలుగు సినిమాల్లో నటిస్తుంది . వీటిల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయిన టాలీవుడ్ సైడ్ తిరిగి చూడదు అంటున్నారు జనాలు. చూఉడాలి మరి ఈ బ్యూటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?