గుంటూరు కారం నుండి “ఓ బేబీ సాంగ్” ప్రోమో వచ్చేసిందోచ్.. మళ్ళీ కాపీ కొట్టేశావా తమన్(Video)..!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల .. హీరోయిన్గా నటిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది .

ఫుల్ టు ఫుల్ మాస్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గానే “ఓ మై బేబీ ” అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమో చూశాక మహేశ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు . ఎక్కడో కాపీ కొట్టినట్లు ఉంది అంటూ అసలు విషయాన్ని రాబట్టేశారు. గతంలో ఆయన తెరకెక్కించిన ఓ పాటలానే ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు .

యు ఆర్ మై డార్లింగ్ అనే పాటకు అచ్చుగుద్దినట్లు ఈ పాట ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు రేంజ్ కి తగ్గ స్థాయి ఈ ప్రోమోకు లేదు అని ఇంకా బాగా ట్యూన్ చేసి ఉండాలి అని చెప్పుకొస్తున్నారు , ఇక్కడ కూడా కాపీనేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఏంటో ఈ మధ్యకాలంలో తమన్ ను ఎంత కష్టపడి ట్యూన్ అందించిన సరే కాపీ కాపీ అంటూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు జనాలు . చూడాలి మరి దీనిపై తమన్ ఏ విధంగా స్పందిస్తాడో..?