సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అంటూ మరోసారి ప్రూవ్ చేసింది హీరోయిన్ సమంత . నిన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉంటూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూనే ఒక్కసారిగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది . కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాను .. మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది . తాను ప్రొడక్షన్ హౌస్ కి పెట్టినట్లు చెప్పుకొచ్చింది. .
అయితే నిన్న మొన్నటి వరకు మయోసైటిస్ వ్యాధితో చాలా ఇబ్బందులు పడిన సమంత అసలు ఈ టైం గ్యాప్ లో ఆమెకు ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు . అంతేకాదు సమంత ఇలా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం వెనుక ఆమె జాన్ జిగిడి టాలీవుడ్ స్టార్ హీరో ఫ్రెండ్ హస్తం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సినిమాలో హీరోయిన్లుగా అవకాశాలు రానప్పుడు .. ముందుగానే ఇలా ప్రొడెక్షన్ హౌస్ పెట్టి మన బడ్జెట్లో సినిమాలు తెరకెక్కిస్తే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని …
తద్వారా లాభాలు వస్తాయి అని వాళ్ళిద్దరూ కలిసి ఇలా ప్లాన్ చేశారట . అంతేకాదు ఇద్దరూ పెట్టుబడులు పెట్టిన సమంత పేరు మాత్రమే బయటికి తీసుకువచ్చాడు ఆ స్టార్ హీరో దానికి కారణం ఇండస్ట్రీలో ఆయనకు పలు బడా కుటుంబాలతో మంచి జాన్ జిగడి ఫ్రెండ్షిప్ ఉండడమే అంటూ తెలుస్తుంది . ఇది తెలిసిన ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి . సమంత వెనుక ఉండి నడిపిస్తున్నది ఆ స్టార్ హీరోనా ..?అంటూ షాక్ అయిపోతున్నారు. ఆమెతో కలిసి ఈ స్టార్ హీరో ఓ సినిమాలో కూడా నటించాడు. కానీ అది అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది..!!