గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ హీరో అభిషేక్ బచ్చన్ ల విడాకుల మేటర్ ఎంత జెట్ స్పీడుగా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా అంతకుముందు కూడా వీళ్లువిడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు ప్రచారంలోకి రాగా వాటిల్ని తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు ఐశ్వర్య – అభిషేక్ క్లారిటీ ఇస్తూనే వచ్చారు . అయితే రీసెంట్గా ఈ జంట విడాకుల వార్తలపై ఏవిధంగా స్పందించకపోవడం ..
అలాగే ఈ ఇద్దరు ఎక్కడికి కలిసి రాకపోవడం విడాకుల వార్తలకు మరింత ఆజ్యం పోస్తుంది . అయితే ఇలాంటి మూమెంట్లోనే ఐశ్వర్య రాయ్ ను తన మామ అమితాబచ్చన్ అన్ ఫాలో చేయడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్టార్ సెలబ్రిటీస్ ఎవరైనా తమ మధ్య విభేదాలు వచ్చిన ఇలా బ్రేకప్స్ చెప్పుకుంటున్న ఆ మూమెంట్లోనే వాళ్ళు ఇలా అన్ఫాలో చేస్తూ ఉంటారు .
ఇప్పటికే ఇలాంటి ప్రాసెస్ ని మనం చాలామంది స్టార్ సెలబ్రిటీస్ల జీవితాలలో చూసాం. అయితే రీసెంట్గా హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ను అమితాబచ్చన్ అన్ ఫాలో చేయడంతో అమితాబ్ ఫ్యామిలీకి ఐశ్వర్య రాయ్ కు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పకనే చెప్పేసాడు అంటున్నారు అభిమానులు. అంతేకాదు అన్ అఫీషియల్ గా విడాకులను కన్ఫామ్ చేసేసినట్లే అంటూ క్లారిటీకి వచ్చేసారు జనాలు..!!
View this post on Instagram