చిరంజీవి 45 ఏళ్లు సినీ ప్రయాణం.. చరణ్ ఎమోషనల్ పోస్ట్ వైర‌ల్‌..!!

చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1978 సెప్టెంబర్ 22న మధ్యతరగతి వ్యక్తిగా చిత్రపరిశ్రమంలో అడుగుపెట్టిన ఈయన టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. సెప్టెంబర్ 22 చిరంజీవి కెరీర్లో అరుదైన.. ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఆయన ఫ్యాన్స్ కు పండగ రోజు కూడా.. ఆయన కీలక పాత్రలో నటించిన ” ప్రాణం ఖరీదు ” విడుదలై నేటికీ 45 ఏళ్లు పూర్తయింది. ఆయన జీవితంలో ఆగస్ట్ 22 కి ఎంతో ప్రాముఖ్యత ఉందో.. సెప్టెంబర్ 22 కి కూడా అంతే ప్రాధాన్యం ఉంది.

ఆగస్టు 22న ఆయన మనిషిగా ప్రాణం పోసుకున్న రోజు అయితే.. సెప్టెంబర్ 22న నటుడుగా ప్రాణం పోసుకున్న రోజు. మెగాస్టార్ 45 ఏళ్లు సినీ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక పోస్ట్ చేశాడు. ” మన ప్రియతమ మెగాస్టార్ కి హృదయపూర్వక అభినందనలు.. సినిమాల్లో 45 ఏళ్లు జర్నీ పూర్తి చేసుకున్న ఆయన అందరిని మెప్పించే నటనతో ఇప్పటి వరకు కొనసాగారు… కొనసాగుతున్నారు కూడా.

మీరు మీ ఆన్ స్క్రీన్ ప్రదర్మనలతో పాటు మీ ఆఫ్ స్క్రీన్ మానవతా కార్యక్రమాలతో మిలియన్స్ మందికి స్ఫూర్తినిస్ఫూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకిత భావం, శ్రేష్ఠతతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా కరుణ వంటి విలువలను మాలో రూపొందించినందుకు నాన్నగారికి ధన్యవాదాలు” అంటూ పేర్కొన్నాడు.