సినిమా ఇండస్ట్రీలో ఎంతో పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్నారు . నాన్న పేర్లు తాతల పేర్లు ..ఫ్యామిలీ పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్ హీరోలుగా మారి ఫైనల్ గా హీరోలుగా రాజ్యమేలేస్తున్న స్టార్ సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు . అయితే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నానా తంతాలు పడి .. ఫైనల్లీ సక్సెస్ అయిన హీరోలు కూడా ఉన్నారు. ఆ లిస్టులోకే వస్తాడు టాలీవుడ్ యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకుని హ్యూజ్ ఫాలోయింగ్ మూట కట్టుకున్న నవీన్ పోలిశెట్టి .
ఈయన పేరు చెప్తేనే అభిమానులు ఓ రేంజ్ లో కేకలు పెడుతూ ఉంటారు. అంతలా కామన్ పీపుల్స్ కు దగ్గర అయ్యారు నవీన్ పోలిశెట్టి . మరీ ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో హీరోయిజాన్ని మెయింటైన్ చేయడంలో నవీన్ పోలిశెట్టి తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు . రీసెంట్గా ఆయన నటించిన సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి “. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ పోలిశెట్టి .. తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియాతో అభిమానులతో షేర్ చేసుకున్నారు .
ఈ క్రమంలోనే లండన్ లో పెద్ద జాబ్ వదులుకొని సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చేసాను అని చెప్పిన నవీన్ పోలిశెట్టి .. సినిమాలో ఛాన్సెస్ కోసం నానా తంటాలు పడ్డానని ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అంతేకాదు చాలా సినిమాల్లో సెలెక్ట్ అయినట్లే అయ్యి.. లాస్ట్ మూమెంట్లో నన్ను తీసేసారని అప్పుడు అర్థమైంది ఇండస్ట్రీలో నటన ముఖ్యం కాదు పలుకుబడి బ్యాక్ గ్రౌండ్ ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు పలువురు డైరెక్టర్స్ ఆయనలోని నటన టాలెంట్ ని చూడకముందే పొట్టిగా ఉన్నావు ..రంగు నల్లగా ఉన్నావ్.. తెల్లగా లేవు.. నీలో ఆ హాట్ నెస్ లేదు ..ఆపరేషన్ చేయించుకో అంటూ సజెస్ట్ చేశారట. ఇలాంటివన్నీ ఫేస్ చేసి నవీన్ పోలిశెట్టి ఇంత స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు. మొత్తానికి కష్టపడితే కచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్పడానికి మరో బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారాడు నవీన్ పోలిశెట్టి..!!