అతిలోక సుందరి శ్రీదేవి ఇమె చనిపోయి చాలా కాలమైనా ఇప్పటికీ కోట్లాదిమంది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. శ్రీదేవి చిన్నతనంలోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ్లోనే కాకుండా హిందీ భాషలోనూ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కొన్ని వందల సినిమాల్లో నటించిన శ్రీదేవి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరితో నటించిన శ్రీదేవి బాలకృష్ణ తో మాత్రం కలిసి సినిమా చేయలేదు.
వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎందుకు రాలేదు అనే అంశంపై ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులలో చర్చ జరుగుతూనే ఉంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి పరిచయమయ్యాడు. ఎన్టీఆర్ డైరెక్షన్లో 1974లో తురకెక్కిన తాతమ్మ కళా సినిమాలో మొదటిసారిగా కనిపించిన బాలకృష్ణ 1984లో సాహసమే జీవితం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటినుంచి ఇప్పటివరకు అదే క్రేజ్‌తో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు బాలకృష్ణ. ఈ క్రమంలో ఎంతో మంది హీరోయిన్లతో బాలకృష్ణ నటించినా.. శ్రీదేవితో మాత్రం జత కట్టలేదు.
1987లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. బాలకృష్ణ – శ్రీదేవితో కలిసి సామ్రాట్ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కలేదు. 1989లో ఏ.కోదండరామిరెడ్డి డైరెక్షన్లో భలే దొంగ మూవీలో కూడా శ్రీదేవిని అనుకున్నారట. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీదేవి ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఇక బాలకృష్ణ – శ్రీదేవి కలిసి రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనురాగ దేవత లాంటి సినిమాల్లో కనిపించారు. కానీ జంటగా ఏ సినిమాలోని నటించలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీదేవి తెలుగులో మెగాస్టార్ తో ఎక్కువ సినిమాల్లో కనిపించింది. వెంకటేష్ తో ఒక సినిమాలో నటించింది.