ఎన్టీఆర్ అన్న ఒక్క మాటతో.. ముకేశ్ అంబానీ అన్ని కోట్లు నష్టపోయాడా..!

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్‌చరణ్- ఎన్టీఆర్‌ ఇమేజ్ పాన్ వరల్డ్ కు చేరింది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్- ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వీరి క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే వీరి కోసం అగ్ర దర్శకులు కూడా డేట్స్ కోసం వేచి చూసే అంతగా వీరి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ నో చెప్పడంతో బాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందట.

RRR Star Jr NTR Gets Trolled Yet Again For His 'American Accent' By  Netizens On Social Media, One Says “Accent Is Delightful, But Awkward..."

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ యూరి ది సర్జికల్ స్ట్రయిక్ ను తెరకెక్కించిన ఆదిత్య ధార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఇమ్మోర్టల్స్ అశ్వత్థామా అనే సినిమాని ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో హీరోగా ముందుగా విక్కీ కౌశల్ ను ఎంపిక చేశారు.. బాలీవుడ్ అగ్ర నిర్మాత రోని స్క్రూవాలా ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల రోని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.

The Immortal Ashwatthama Shelved Because 'NTR Jr, Yash Not Interested'?  Here's What We Know

ఆదిత్య ధార్ చాలా మంది నిర్మాతలను కలిసి ఎట్టకేలకు జియో సంస్థ కోసం ముఖేష్ అంబానీ టీమ్ ని ఒప్పించాడు. అయితే విక్కీ కౌశల్ కు అంత మార్కెట్ లేదని గుర్తించిన జియో అతన్ని మార్చాలని నిర్ణయించుకుంది. స్టార్ వేల్యూ కావాలనే ఉద్దేశంతో ఆదిత్య.. కెజిఎఫ్ యష్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ లను సంప్రదించాడు. అయితే ఇద్దరూ అంత సుముఖంగా లేరట.

ఎన్టీఆర్ నో చెప్పడంతో ముకేశ్ అంబానీ భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ముకేశ్ అంబానీ ఇప్పటివరకు 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. ఎన్టీఆర్ నో చెప్పడంతో ప్రాజెక్ట్ పై 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసే కంటే నిలిపివేయడమే ఉత్తమని ముకేశ్ అంబానీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ప్రాజెక్ట్ ను రద్దు చేసుకున్నారట.