ఏపీలో మళ్ళీ జగన్ హవా..స్వీప్ అంటా.!

ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పిలు గట్టిగానే కష్టపడుతున్నాయి. ఇదే క్రమంలో పార్టీల గెలుపుపై ఎప్పటికప్పుడు సర్వేలు కూడా జరుగుతున్నాయి. సొంత సర్వేలతో పాటు…థర్డ్ పార్టీ సంస్థలు సైతం సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకో సరే ఒకో పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే తాజాగా ఓ సర్వే బయటకొచ్చింది.  టైమ్స్ నౌ నవభారత్, ఈటీజీ రీసెర్చ్ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. బీజేపీ కూటమి(ఎన్డీఏ)కి 292-338 సీట్లు వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్ పార్టీ కూటమికి 106-114 సీట్లు రావచ్చని అంచనా వేసింది. టీఎంసీకి 20-22, ఇతరులకు 66-96 వరకు సీట్లు రావచ్చని పేర్కొంది. అటు ఏపీలో కూడా టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన సర్వే ప్రకారం..వైసీపీకి 24-25 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అంటే ఏపీ ప్రజలు మరోసారి వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పింది.

మరో ఆ సర్వే చెప్పినట్లు జరుగుతుందా? అంటే చెప్పలేం..అసలు ఏపీలో ఉన్నదే 25 ఎంపీ సీట్లు..ఇక వైసీపీకి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు పెద్దగా లేవు. గత ఎన్నికల్లోనే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పి..22 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ కేంద్రంపై పోరాడింది లేదు..రాష్ట్రానికి సాధించింది ఏమి లేదు.

అటు గెలిచిన వైసీపీ ఎంపీలు చేసేది ఏమి లేదు. దీంతో ఎంపీలపై వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఇలాంటి తరుణంలో వైసీపీ 10 ఎంపీ సీట్లు గెలిస్తే చాలు అన్నట్లు పరిస్తితి ఉంది. చూడాలి మరి నెక్స్ట్ ఎన్నికల్లో పరిస్తితి ఎలా ఉంటుందో.