సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కంటే బబ్లి బ్యూటీ హన్సిక ముందు వరుసులో ఉంది. లేడీ సూపర్ స్టార్ తో హన్సికకు పోటీ ఏంటి..అనుకుంటున్నారా.. అసలు మ్యాటర్ ఏమిటంటే..ఈ ముద్దుగుమ్మ లిద్దరూ క్రేజీ భామలే..ఈ ఇద్దరు బహుభాషా నటీమణులే.. ఇద్దరు కూడా ప్రేమ విషయంలో చేదు అనుభవాలను చూసిన వాళ్లే.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నయనతార- హన్సిక ఇద్దరూ కోలీవుడ్ హీరో శింబును ప్రేమించి విఫలమైన వాళ్లే.
![Hansika on ex-couple Simbu-Nayanthara coming together again: I can't really comment on it [Throwback] - IBTimes India](https://data1.ibtimes.co.in/en/full/732349/simbu-nayanthara-hansika-motwani.jpg?h=450&l=50&t=40)
అయితే నయనతార కాస్త సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇద్దరూ కూడా చివరికి లవ్ మ్యారేజ్ చేసుకొని సెటిలైన వాళ్ళే. ఈ ఇద్దరి పెళ్లిళ్లు కూడా ఎంతో ధూమ్ ధూమ్ గా జరిగాయి. ఇక వారి పెళ్లిళ్లతో కూడా ఇద్దరూ ఎంతో సొమ్ము చేసుకున్నారు. నయనతార కోలీవుడ్ దర్శకుడువిఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది.. ఇక వారి పెళ్లి తతంగం అంత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్సీ పర్యవేక్షణలో జరిగింది.

అదేవిధంగా పబ్లి బ్యూటీ హన్సిక తన చిన్ననాటి స్నేహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ ను రీసెంట్గా పెళ్లి చేసుకుంది. ఎంతో గ్రాండ్‌గా జరిగిన వీరి పెళ్లి తతంగాన్ని కూడా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి చెల్లించి ప్రసార హక్కులను పొందినట్టు సమాచారం. ఇక ఇద్దరి ముద్దుగుమ్మల పెళ్లి వీడియో కోసం వారి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నయనతార పెళ్లి జరిగి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఓటీటీలో ప్రసారం అవలేదు.

ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అలాంటిది రీసెంట్గా పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లి వీడియో త్వరలోనే ఓటీటీలో రాబోతున్నట్టు ఈ విషయాన్ని హన్సిక తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు స్వయంగా చెప్పింది. ఈ విధంగా నయనతార కంటే హన్సిక ముందు వరుసలో ఉందన్నమాట.
View this post on Instagram

