సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ కమెడిమన్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎందరినో తన అభిమానులను మార్చుకున్నాడు. అమ్మాయి కలల రాకుమారుడిగా మారాడు.
![Sudigali Sudheer Photos [HD]: Latest Images, Pictures, Stills of Sudigali Sudheer - FilmiBeat](https://www.filmibeat.com/ph-big/2020/02/sudigali-sudheer_158098212860.jpg)
ఇక ఈ మధ్య హీరోగా కూడా మారిన సుధీర్.. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. సుధీర్ గురించి ఇంటస్ట్రింగ్ విషయం ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. నిజానికి ఇండస్ట్రీలో అందరూ ఆయన్ను సుడిగాలి సుధీర్ అనే పిలిస్తుంటారు. కానీ, సుధీర్ అనేది ఆయన పేరే కాదట.

అసలు ఇంతకీ సుధీర్ అసలు పేరేంటో తెలుసా.. సిద్ధూ. అవును, ఇంట్లో సుధీర్‌ను సిద్ధూనే అంటారట. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరూ అదేనట. ఈ విషయాన్ని స్వయంగా సుదీర్ అక్కనే తెలిపింది. ఈ మధ్య ఓ ఈవెంట్‌కు వచ్చిన ఆమె.. స్టేజ్‌పై అందరి ముందూ సుధీర్‌ను సిద్ధూ అని పిలిచిందట. దాంతో అక్కడున్న వాళ్ళతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.. అక్కడ సిద్ధూ ఎవరబ్బా అని..! ఆ తర్వాత సుధీర్ అక్క అసలు విషయం చెప్పింది. సుధీర్ అసలు పేరు సిద్ధూనే అని, మేమందరం అలానే పిలుస్తామని తెలిపింది.

