రెండో పెళ్లి.. ట్విస్ట్ ఇచ్చిన నిహారిక..!

టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక .. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత నిర్మాతగా మారినా కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. తాజాగా ఈమె నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికా రెండవ పెళ్లి పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

గతంలో నిహారిక జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకొని మరీ కొన్ని కారణాల చేత విడిపోయారు. అలాగే విడాకుల తర్వాత జీవితం ఎలా ఉంది అనే ప్రశ్న యాంకర్ అడగగా అందుకు నిహారిక ప్రస్తుతం ఇప్పుడిప్పుడే జీవితం మరింత మెరుగ్గా ముందుకు వెళుతోంది అనుకుంటున్నాను.. కేవలం పని పైన దృష్టి సారించాను అంటూ తెలిపింది నిహారిక. రాబోయే రోజుల్లో మంచి సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది.

అలాగే మళ్లీ ప్రేమ పెళ్లి గురించి ప్రశ్నించగా.. కేవలం తాను హ్యాపీగా ఉండాలనుకుంటున్నానని.. అది సింగిల్ గా అయినా సరే లేకపోతే ఎవరితో కమిట్ అయిన కూడా.. ఇలాంటి వాటికి తాను విరుద్ధంగా వెళ్ళను అంటూ తెలిపింది. అయితే అలాంటి సమయం కోసం తాను వెతుక్కుంటూ వెళ్లనని .. టైం వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది అంటూ నిహారిక తెలియజేసింది.. అలాగే తన కుటుంబం కూడా తన ప్రతి విషయాన్ని కూడా గౌరవిస్తారని తెలిపింది నిహారిక.

తనకి రెండవ పెళ్లి చేయాలని కుటుంబం అనుకుంటున్నా, ఆ విషయం తన మీద ఒత్తిడి తీసుకురాలేదని తెలిపింది నిహారిక. ప్రస్తుతం తన వయసు 30 సంవత్సరాలు అని, తాను ప్రేమకు తలుపులు మూసేయలేదు కానీ ఏదైనా రిలేషన్ షిప్ లోకి వెళ్ళాలి అంటే దాని స్వతంత్రంగా ఆలోచించేలా ఉంటానని తెలిపింది నిహారిక.