మెగాస్టార్ నటవారసుడిగా చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా తండ్రికి తగ్గ తనయుడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు చరణ్. ఇక చరణ్ భార్య ఉపాసన పెద్ద బిజినెస్మెన్.. కామినేని చైర్మన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుట్టడమే గోల్డ్ స్పూన్ తో పుట్టిన చరణ్.. ఉపాసన మొదటినుంచి కష్టపడే తత్వంతో తమ రంగాల్లో విజయాలను సాధిస్తున్నారు.
ఉపాసన అపోలో గ్రూప్స్ కీలక బాధ్యతలు నెరవేరుస్తుండగా.. చరణ్ హీరోగా సత్త చాటుతున్నాడు. ఇక కాలేజ్ డేస్‌లో స్టార్ట్ అయిన ఇద్దరి పరిచయం ప్రేమగా వారి 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తర్వాత 2023జూన్ 22న ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు క్లింకారా అని నామకరణం చేశారు. ఇక ఈ మెగా ప్రిన్సెస్ పుట్టిన తర్వాత మెగా కుటుంబంలో ఎన్నో శుభకార్యలు జరిగాయి.
ఈ క్రమంలో ఉపాసన పుట్టిన తర్వాత.. చరణ్ భార్య ఉపాసన పేరును మార్చేసాడని.. ఓ క్యూట్ నిక్ నేమ్ తో పిలుస్తున్నాడు అంటూ తెలుస్తుంది. తాజాగా ఈ విషయం తెగ వైరల్ గా మారింది. జూలైలో ఉపాసన బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. హ్యాపీ బర్త్‌డే మమ్మీ అని కామెంట్‌తో పాటు.. ఉపాసన దిగిన సెల్ఫీ ని చరణ్ పోస్ట్ చేసుకున్నాడు. దీంతో ఉపాసనకు రాంచరణ్ కొత్త పేరు పెట్టారని.. ఇకపై కారా మమ్మీ ఉపాసనను.. చరణ్ కూడా క్యూట్ గా మమ్మీ అని పిలుస్తాడని నెటిజన్స్ తమా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో.. ఆర్సీ 16 కోసం సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక గేమ్ చేంజర్ ప్రమోషన్ పనులు కూడా పూర్తిగా పూర్తయిన వెంటనే ఆర్సి 16 షూటింగ్ షురూ చేసే అవకాశం ఉందని టాక్.