“మృణాల్ ని చూసి బుద్ధి తెచ్చుకోండి మేడం”…పాన్ ఇండియా హీరోయిన్ కు ఫాన్స్ ఘాటు సజెషన్..!

సందు దొరికితే చాలు ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని.. ఏ హీరోయిన్ ఫాన్స్ ఆ హీరోయిన్ పొగిడేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ పేరుని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు .
ఆమె జనాలు అందరూ మృణాల్ ను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. దానికి కారణం కల్కి సినిమా .. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది .

ఈ సినిమాతో ప్రభంజనం సృష్టించాడు ప్రభాస్ అనే చెప్పాలి. మొదటి రోజే ఏకంగా 180 కోట్లు కలెక్ట్ చేసింది . కాగా ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ని పెట్టుకున్నాడు నాగ్ అశ్వీన్. చిన్న చిన్న పాత్రలే అయినప్పటికీ చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా కనిపిస్తుంది . అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించినందుకు గాను ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ అందుకోలేదట .

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులో నటిస్తుంది అంటే కచ్చితంగా మ్యూనరేషన్ తీసుకుంటారు . కానీ మృణాల్ మాత్రం అస్సలు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట . అంతేకాదు ఇప్పుడు ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . ఒక హీరోయిన్ పేరును టార్గెట్ గా చేసుకొని ఆమెను సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురి చేస్తున్నారు. ఒక్క సెకన్ కనిపించినా సరే కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ఆ హీరోయిన్ ని ట్రోల్ చేస్తూ మృణాల్ ను చూసే బుద్ధి తెచ్చుకోండి మేడం అంటూ పరోక్షకంగా ఘాటు సజెషన్ ఇస్తున్నారు . ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!!