“పవన్ కళ్యాణ్ కొణిదెల అనే నేను”..సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్న మెగా ఫ్యాన్స్..!!

అబ్బబ్బ .. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి కోట్లాదిమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూసిన మూమెంట్ రానే వచ్చేస్తుంది . ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు ..ముఖానికి రంగులు పూసుకుని నటించేవాడు.. అక్కడి మాట ఇక్కడ చెప్పేవాడు అని.. దారుణాతి దారుణంగా కొందరు రాజకీయ నేతలు ట్రోల్ చేశారు . అయినా ఒక సినీ హీరోకి రాజకీయాలు అంటే ఏం తెలుసు..? ప్రజాసేవ అంటే ఏం తెలుసు..? అంటూ దారుణాతి దారుణంగా మాట్లాడారు .

మరికొందరు ప్యాంట్ లోపల ప్యాంటు వేసుకునేవాడు అంటూ వెటకారంగా కూడా ట్రోల్ చేశారు. అయితే ఆ మాటలను చాలా ఓపికగా భరించాడు పవన్ కళ్యాణ్. టైం వస్తుంది టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అంటూ చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారు. ఫైనల్లీ కూల్గానే దెబ్బ కొట్టాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విన్నింగ్ మూమెంట్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను సైతం షేర్ చేస్తూ సోషల్ మీడియాని కుదిపేస్తున్నారు .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు . త్వరలోనే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు మంచి పోస్టు ఇవ్వాలి అంటూ చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాణస్వీకారంలో “పవన్ కళ్యాణ్ కొణిదెల అను నేను ” అనే డైలాగ్ పవన్ నోట వినడానికి హ్యూజ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈయనకు సంబంధించిన ఇదే వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు అభిమానులు..!!