దగ్గినప్పుడు-తుమ్మినప్పుడు యూరిన్ లీక్ అవుతుందా..? అయితే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి ఈ ప్రాబ్లం సాల్వ్..!!

చాలామంది మహిళల్లో ఈ సమస్య కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మహిళలల్లో గర్భసంచి ..పెల్విక్ ఏరియా.. బాగా వీక్ అయిపోతూ ఉంటుంది . ఆ టైంలో మహిళలకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వందలో 90 శాతం మంది మహిళలు ఈ యూరిన్ లీకేజ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు ..దానికి కారణం బిడ్డ పుట్టినప్పుడు పెల్విక్ ఏరియా ఎక్స్పాండ్ అవ్వడం.. ఆ ప్రెజర్ తట్టుకోలేకపోవడమే. బిడ్డ పుట్టిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది .

అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఒకటే ఒక చిట్కా ఫాలో అయితే చాలు . ప్రతిరోజు మీకు సమయం కుదిరినప్పుడల్లా హీలింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీ సమస్య నెలరోజుల్లో తీరిపోతుంది. డాక్టర్స్ ఇదే చెప్తున్నారు. యూరిన్ వెళ్లే పార్ట్ అదేవిధంగా.. మోషన్ వెళ్లే పార్ట్ గట్టిగా బిగపట్టి ఒక 30 సెకండ్స్ లేకపోతే ఒక్క నిమిషం ..మీరు ఎన్ని నిమిషాలు అలా బిగ పెట్టగలిగితే అన్ని నిమిషాలు (ఒకటిన్నర నిమిషానికి మించకుండా) చేయగలిగితే మీకు ఈ యూరిన్ లీకేజ్ సమస్య తగ్గిపోతుంది.

అంతేకాదు బ్రీత్ ఇన్.. బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ యూరిన్ లీకేజీ సమస్య తగ్గుతుంది అంటున్నారు డాక్టర్లు. మరీ ముఖ్యంగా కొందరు మహిళలు ఈ సమస్యను డాక్టర్ దగ్గర చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు . అయితే అల సిగ్గుపడుతూ ఉంటే మన ఆరోగ్య సమస్య తీరదు అని .. ఏ విషయాన్ని అయినా సరే డాక్టర్ దగ్గర నిర్మొహమాటంగా చెప్పాలి.. ఈ హీలింగ్ ఎక్సర్సైజ్ రోజుకి 10 సార్లు చేయడం ద్వారా నెల రోజుల్లోనే యూరిన్ లీకేజ్ సమస్యలను మహిళలు తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు..!!