తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో మారుతీ ఒకడు. ప్రస్తుతం ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా తెరకెక్కిస్తున్న మారుతి.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. తన సత్తా మరోసారి చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మారతి బాలీవుడ్ బాట పట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మారుతి బాలీవుడ్ పై కన్ను వేశారని.. అక్కడికి నుంచి ఆయనకు చాలా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది.
స్టార్ హీరోలు కూడా మారుతితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని.. అందులో భాగంగానే ఆయన కొంతమంది స్టార్ హీరోలను కలిసి వాళ్లకు కథలను కూడా వినిపించినట్లు సమాచారం. ఇక మారుతి బాలీవుడ్లో సినిమా తెరకెక్కించి.. సక్సెస్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మారుతి ప్రస్తుతం వరుస సినిమాలు తెరకెక్కిస్తూ బిజీ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం రావడంతో స్టార్ట్ డైరెక్టర్ లిస్టులో పేరు సంపాదించుకున్నాడు మారుతి.
ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటే ఆయన వైవిధ్యమైన కథలను తెరకెక్కించి సక్సెస్ అందుకునే డైరెక్టర్ మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో మారుతి సక్సెస్ అందుకుంటే ప్రభాస్ అభిమానుల్లో కూడా ఈయనకు మరింత క్రేజ్ పెరుగుతుంది. దీంతో మారుతి ఆశలని ఈ సినిమా పైన ఉన్నాయి. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ కొట్టి వండర్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు మారుతి.