నటి అనికా సురేంద్రన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అజిత్, నయనతార కాంబోలో తెరకెక్కిన విశ్వాసం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ఎలాంటి సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించని ఈ చిన్నది.. గత ఏడాది ‘ బుట్ట బొమ్మ ‘ సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా పలు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలను యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ పలు సందర్భాల్లో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటుంది. కాగా తాజా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన అనికా.. తనపై వస్తున్న ట్రోల్స్ పై ఎమోషనల్ అయింది. ఇండస్ట్రీలో ఫిమేల్ సెలబ్రిటీస్ పై ఎప్పటికప్పుడు ట్రోల్స్ ఎదురవుతూనే ఉన్నాయి. అయితే దానికి గ్లామరస్ డ్రెస్సులు వేసుకోవడం కూడా కారణం. నేను వేసుకునే బట్టల పై కూడా ఇప్పటికే ఎంతోమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం నా పర్సనల్ విషయం. ఎవరి కోసం నా ఇష్టాన్ని దాచుకోవాల్సిన పనిలేదు. కామెంట్ పెట్టాలని ఉద్దేశం ఉంటే చీర కట్టిన కామెంట్ చేస్తారు.
గ్లామరస్ డ్రెస్ వేసిన ఏదో ఒకటి అంటారు. నా డ్రెస్సింగ్ గురించి చేసే కామెంట్స్ నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. బాధను కల్పిస్తున్నాయి. నేను మనిషినే.. నాకు ఫీలింగ్స్ ఉంటాయి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోలేకపోతున్నా. చాలా కష్టంగా అనిపిస్తుంది. దయచేసి ఎలా పడితే అలా కామెంట్స్ చేయకండి. మీకు నచ్చినట్లు మీరు ఎలా ఉంటున్నారో.. మాకు నచ్చినట్లు మమ్మల్ని అలానే ఉండనివ్వండి అంటూ వివరించింది. ప్రస్తుతం అనిత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.