ఛాన్స్ వస్తే ఆయన బయోపిక్ తీయాలని ఉంది.. డైరెక్టర్ సందీప్ వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చేసింది కేవలం మూడు సినిమాలే అయినా ఓ స్టార్ డైరెక్టర్‌గా భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా మారిన ఈయన మొదటి సినిమాతోనే సంచలనాన్ని సృష్టించాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో భారీ కలెక్షన్లను రాబట్టి.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక అర్జున్ రెడ్డినే.. బాలీవుడ్‌ లో కబీర్ సింగ్ టైటిల్ తో రీమిక్స్ చేయగా అక్కడ కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా మరోసారి యానిమల్ తో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు సందీప్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆయ‌న మాట్లాడుతూ.. తన మనసులోని కోరిక కూడా బయటపెట్టాడు. ఛాన్స్ దొరికితే.. ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన మైకేల్ జాక్సన్ బయోపిక్ సినిమాగా తీయాలని ఉందంటూ వివరించాడు. అయితే మైకేల్ జాక్సన్ పాత్రను ఎవరు పోషిస్తారు అన్నదే ఇప్పుడు ప్రశ్న అని.. సరైన హీరో దొరికితే హాలీవుడ్‌లో ఈ సినిమా తీస్తా అంటూ చెప్పుకొచ్చాడు.

మైకల్ జాక్సన్ జీవితం ఎంతో ఆసక్తికరంగా సాగిందని.. అతని చిన్ననాటి రోజులు.. స్టార్ గా ఆయన లైఫ్ జర్నీ.. అదంతా కథగా సినిమా తీస్తే భారీ సక్సెస్ సాధిస్తుందని.. ఈ సినిమాను ప్రేక్షకులు కూడా ఎగబడి చూస్తారంటూ వివరించాడు. ఒక్కోసారి మైకేల్ బయోపిక్ ను ఎవరైనా డైరెక్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది.. లేదా కరెక్ట్ హీరో దొరికితే నేనే రూపొందిస్తా అంటూ సందీప్ రెడ్డి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో మైకేల్ బయోపిక్ దొరికితే హాలీవుడ్ లోనే కాదు తెలుగులోనూ తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ నెటిజ‌న్స్ త‌మ‌ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు.