మాట్లాడడానికి మాటలు రావు.. వినడానికి చెవులు లేవు.. అయినా ఇండస్ట్రీలో రాణిస్తున్న స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలంటే అన్ని ఉన్న ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. మనిషిలో అన్ని భాగాలు సరిగ్గా నే ఉన్నప్పటికీ డైరెక్టర్లు అది బాలేదు ఇది బాలేదు అంటూ ఏదో ఒక రూల్ పెడుతూ ఉంటారు. ఇక ఇలాంటివి హీరోయిన్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వారు హీరోయిన్ అవ్వాలంటే అన్నిటికీ తెగించి ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి.

కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం తనకి మాటలు రావు అదేవిధంగా చెప్పిన మాటలను వినైనా ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనుకుంటే.. తనకి వినిపించదు కూడా. మాటలు రాకుండా వినిపించకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆమె మరెవ్వరూ కాదు అభినయ. ఈమె కెరీర్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

క్రైమ్ 28, రాజు గారి గది వంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మాటలు రాకుండా ఇన్ని ఎలా మేనేజ్ చేసింది అనే డౌట్ అందరిలోనూ నెలకొంది. నిజానికి ఈమెకి ఇనిపించకపోయిన ఈమె బాడీగార్డ్ గా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయే అభినయ చేసిన సైగులను గుర్తించి మైక్ లో చెబుతూ ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎక్స్ప్రెషన్స్ నీకు గుర్తించి ఆమె చెప్పడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఏదేమైనా మాటలు రాకుండా చెవులు వినిపించకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు.