ఏదైనా ఓ విషయాన్ని చాలా డీప్ గా చెప్పాలన్నా.. ఎక్కువ మందికి తెలిసేలా చేయాలన్నా.. అందరిని ప్రభావితం చేసే ఒకే ఒక్క వేదిక సినిమా. చాలామంది విషయాన్నీ తెలియజేయాలంటే సినిమా మాధ్యమాన్ని వాడుకుంటూ ఉంటారు. అందుకే సినీ దర్శకులు ఎక్కువగా.. ఓ మెసేజ్ ని తమ సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పేందుకు ప్రయత్నిస్తారు. వాళ్ళ భావాలను సినిమాల ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా రూపొందిస్తారు. ఇలా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను చూసి మారిన వారు చాలామంది ఉన్నారు.
ఇలాంటి క్రమంలో ఇస్కాన్ వారు కూడా భగవద్గీత గొప్పతనాన్ని ఈ జనరేషన్ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో.. ఓ సినిమాను రూపొందిస్తున్నారు. దానికోసం ముందుగా ఒక షార్ట్ ఫిలిం తెరకెక్కించాలని ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగా యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లమూడి షార్ట్ ఫిలింని రూపొందించనున్నాడట. ఇక దీనికి కథ సత్యానంద్ హరిదాస్ ఇచ్చారు. సీతారాం ప్రభు నేతృత్వంలో అత్తాపూర్ ఇస్కాన్ ఆలయంలో దీన్నే రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బిజీగా జరుగుతున్నాయి. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ తో సహా అన్ని ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమా ప్రసారం కానుందని టాక్. ఇక ఇస్కాన్ వారు తమ గొప్పదనాన్ని తెలియజేయడానికి ఎప్పుడు కమర్షియల్ దర్శకులని ఎంచుకుంటారు.
కానీ సంతోష్ జాగర్లమూడి లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి.. వాళ్లే సినిమా బాధ్యతలు అప్పజెప్పడం అంటే సాధారణ విషయం కాదు. ఇది నిజంగా డైరెక్టర్ ప్రతిభకు కొలమానం అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆయన సుమంత్ హీరోగా మహేంద్రగిరి వారాహి సినిమాను రూపొందిస్తున్నాడు. డైరెక్టర్ సంతోష్ చాలా బిజీగా ఉండి కూడా భగవద్గీత గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఒకే ఒక్క కాన్సెప్ట్ తో వాళ్ల నిర్ణయానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మొదట షార్ట్ ఫిలిం ని రూపొందించాడు. ఇక సంతోష్ జాగర్లమూడి లాంటి డైరెక్టర్ సినీ ఇండస్ట్రీలో చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు.
ఒక కథను నమ్మితే దానికోసం ఎన్ని సంవత్సరాలైనా కాంప్రమైజ్ అవ్వకుండా.. నమ్మకంతో ట్రావెల్ చేయడం అనేది ఒక దర్శకుడు సంతోష్ కి సాధ్యమవుతుంది. ఇక ప్రస్తుతం దస్తున్న వారాహి సినిమా బడ్జెట్లో మొదట రూ.8 కోట్లు అనుకున్నా అది తర్వాత రూ.15 కోట్లు కూడా దాటిపోయింది. అయినప్పటికీ ప్రొడ్యూసర్ సంతోష్ కథ మీద ఉన్న నమ్మకంతో.. సినిమా కోసం పడే కష్టాన్ని చూసి సినిమాకు డబ్బులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈ మూవీ తో ఎలాగైనా భారీ సక్సెస్ కొట్టాలని సంతోష్ జాగర్లమూడి అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇప్పటికే సంతోషం సినిమా చేయడానికి మాస్ మహారాజ్ కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే.