ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకున్నా సినిమాల్లో హనుమాన్ మొదటిది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సౌత్ సినీ ప్రేక్షకులంతా బ్రహ్మరథం పట్టారు. సినిమా సంక్రాంతి బరిలో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌లో.. భారీ విజువల్స్ లో రూపొందిన ఈ సినిమా.. దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి రికార్డులను క్రియేట్ చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో కథ, కథనం, విజువల్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి అనడంలో సందేహం లేదు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది.
సూపర్ హీరో కాన్సెప్ట్ తో హిందూ మైథలాజికల్ని టచ్‌తో వచ్చిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా క్లైమాక్స్లో హనుమాన్ ను క్రియేట్ చేసిన విధానానికి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. సాక్షాత్తు హనుమంతుడిని చూసిన అనుభూతి వారికి కలిగింది. అంతలా ఆడియన్స్‌ను కట్టిపడేసిన ప్రశాంత్.. ఈ సినిమా చివరిలో సీక్వెల్‌గా జై హనుమాన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందంటూ. సర్ప్రైజ్ చేశాడు. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకాన్నునాయంటూ తాజా అప్డేట్ తో ఫ్యాన్స్‌ను ఖుషి చేశాడు ప్రశాంత్.
దీంతోపాటే జై హనుమాన్ సినిమా గురించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు మాస్టర్ ప్లాన్ వేశాడట ప్రశాంత్. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. హనుమంతుడు సినిమాకు శ్రీరామనవమి కంటే ప్రత్యేకమైన రోజు ఇంకేం ఉంటుంది.. అందుకే ఆరోజు సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని ప్రశాంత్ ఫిక్స్ అయ్యాడంటూ తెలుస్తుంది. త్వరలోనే విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. ఈ అప్డేట్ తో జై హనుమాన్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.