టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ – జీవిత జంట గురించి అందరికీ తెలుసు. హీరో రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న జీవితా తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జీవిత రాజశేఖర్ అంటేనే ఆమెను గుర్తిస్తారు. అయితే ఆమె జీవితం భర్త పేరుతోనే కాదు.. అతని కష్ట, సుఖాల్లోనూ సగభాగం పంచుకుంటూ బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆమె కూడా స్టార్ హీరోయిన్.. అంతటి సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న కూడా పెళ్లి చేసుకున్న వెంటనే సినిమాలకు దూరమై ఆదర్శ గృహిణిగా కుటుంబ బాధ్యతలను మోస్తుంది. ఇక రాజశేఖర్ ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తూ, పిల్లల కెరీర్ సరిదిద్దుతూ ఇప్పటివరకు జీవితంలో సాగించిన ప్రయాణం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఓ ఇంటి గృహిణిగా జీవితా ఎంతో సైలెంట్‌గా ఉన్నా.. స్త్రీలకు ఏదైనా అన్యాయం తన కళ్ళ ముందు జరిగితే మాత్రం శివంగిలా మారిపోతుంది. వారిని ప్రశ్నించడంలో, వారితో పోరాడడంలో ఆమె ముందుంటుంది.
స్త్రీల బాధ్యతలు తెలిసిన మహిళగా మహిళా హక్కుల కోసం ఆమె పోరాడుతుంది. అందుకే అప్పటి సీనియర్ హీరోయిన్స్ లో జీవిత రాజశేఖర్ ఎంతో ప్రత్యేకం. సినిమాలకు దూరమైన అప్పుడప్పుడు పలు షోలలో కనిపిస్తూ సందడి చేసే జీవిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతవ ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. జీవిత రాజశేఖర్.. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇష్టా, అయిష్టాలు తన జీవితంలో జరిగే ఆసక్తికర విషయాలు వివరించింది. ఈ సందర్భంగా ఆమె నాకు మా వారిని, మా ఇంటిని, నా ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యమంటూ వివరించింది. నా జీవితంలో నా ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ అంటూ.. నా ఫ్యామిలీ పనులు ఇంకెవరు చేయడం నాకు ఇష్టం ఉండదు అంటూ చెప్పుకొచ్చింది. వారికి కావాల్సినవి తెచ్చి పెట్టడం, చేసి పెట్టడమే నాకు ఇష్టమంటూ విరించిన ఆమె నాకు బయటకు వెళ్లి అలవాటు కూడా ఎక్కువగా లేదు.
కాబట్టి ఫ్రెండ్స్, గ్రూప్స్ ఏమీ లేవు. ఇక నా స్కూల్ ఫ్రెండ్స్ తో నేను ఇప్పటికి టచ్ లో ఉన్నా వారిలో డైరెక్టర్ తేజ, కొరియోగ్రాఫర్ బృందా, సుచిత్ర చంద్రబోస్ కూడా ఉన్నారంటూ వివరించండి. ఎలాంటి టైం లో అయినా సరే తాగడం అనేది నాకు అసలు అలవాటు లేదంటూ వివరించిన ఆమె.. నేను మహిళను కాబట్టి మందు తాగానని చెప్పడం లేదు.. నాకు ఇష్టం లేదు కాబట్టి తాగను. ఒకవేళ ఎవరైనా ఆడపిల్ల మందు తాగడం ఏంటి అని ప్రశ్నిస్తే నేను ఒప్పుకోను.. వెళ్ళు ఎందుకు తాగకూడదని నిలదీస్తా అంటూ ప్రశ్నించింది. సరదాలనేవి అందరికీ ఉండొచ్చు. దానిని జెండర్‌తో పోల్చాల్సిన అవసరం లేదు. మందు తాగడానికి ఆడ, మగ తేడా అవసరం లేదు అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జీవిత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో అమ్మపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మంచి గృహిణి అని ఇంతవరకు మీపై రెస్పెక్ట్ ఉండేది మీ నుంచి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ వస్తాయని అసలు భావించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.