దాని కోసం ఎన్ని సార్లు అయినా పెళ్లి చేసుకుంటావా..? రష్మి డ్రామాలు పై ఫ్యాన్స్ చీప్ కామెంట్స్..!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ పెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా రష్మీ – సుధీర్ పెళ్లి . వీళ్ళకి సంబంధించిన పెళ్లి వార్తలు ఇప్పటికి ఎన్నిసార్లు వైరల్ అయ్యాయో మనకి తెలిసిందే జనాలు కూడా వీళ్ళ పెళ్లి వార్తలు చదవడం చూడడం మానేశారు . అంత విసుగు తెప్పించేశారు ఈ జంట . మా మధ్య ఏమీ లేదు అంటూనే పలు ఈవెంట్స్ లో ఏదో ఉన్నట్లు యాక్ట్ చేయడం ఈ జంటకు ఉన్న స్పెషాలిటీ .

కాగా రీసెంట్గా రష్మీ తన పెళ్లిపై గుడ్ న్యూస్ వినిపించబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. రష్మీ పెళ్లి పార్టీ అంటూ ఓ ఈవెంట్ ని కండక్ట్ చేశారు మేకర్స్ . ఈ పెళ్లి పార్టీలో ఆమె తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ని వినిపించబోతుంది అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు . అయితే దీనిపై రష్మీ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . మీ షో ప్రమోషన్స్ కోసం ఎన్ని సార్లు అయినా పెళ్లి చేసుకుంటావా?

పెళ్లి అనేది లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు తెలియదా..? ఇప్పటికే నువ్వు – సుధీర్ ఎన్నిసార్లు షోలో పెళ్లి చేసుకున్నారు . ఇప్పటికైనా కనీసం ఇలాంటి షోలు చేయడం మానేసేయ్. నీ డ్రామాలు ఇక మేము చూడలేం అంటూ కూసింత ఘాటు గానే ఆన్సర్ ఇస్తున్నారు. ప్రసెంట్ రష్మి పెళ్లి పార్టీకి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది..!!