ఆ హీరోయిన్ జపం చేస్తున్న రాజమౌళి… ఈ భజన మరీ టూమచ్ గా ఉందే..!

జనరల్ గా మనం స్టార్ సెలబ్రిటీస్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉన్న హీరోయిన్స్ ని హీరోలనే చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోలు హీరోయిన్లకు మించిన రేంజ్ లో డైరెక్టర్స్ పాపులారిటీ దక్కించుకుంటున్నారు . సుకుమార్ – ప్రశాంత్ నీల్.. రాజమౌళి లాంటి వాళ్ళ పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగి పోతున్నాయి . అయితే ఇలాంటి క్రమంలోనే దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న జక్కన్న ఒక హీరోయిన్ ని ఈ రేంజ్ లో పొగిడేయడం ఇప్పుడు అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది .

జనరల్ గా జక్కన్న హీరోయిన్స్ పై పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయడు . హీరోలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు . అయితే అలాంటి రాజమౌళి సలార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . శృతిహాసన్ ను ఓ రేంజ్ లో పొగిడేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది . ప్రభాస్ అంటే ఫేవరెట్ హీరో ఆయనను ఎంత పొగిడినా తప్పులేదు . శృతిహాసన్ తో ఆయన అసలు సినిమాలే తీయలేదు.

మరి ఆమె గురించి చూసింది చూసినట్లు చక్కగా చెప్పడమే కాకుండా ఆమె డాన్స్ ను రేంజ్ లో పొగడేసారు . ఇండస్ట్రీలో అలా డాన్స్ చేసే హీరోయిన్ నే లేదు అంటూ చెప్పడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . దీంతో శృతిహాసన్ పై రాజమౌళి స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశాడని అందుకే ఆమెను ఈ రేంజ్ లో పొగిడారు అని బహుశా మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా ఆమెనే పెట్టుకుంటాడేమో అంటున్నారు జనాలు..!!