సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా నాగచైతన్య సమంతల పెళ్లి విడాకుల మేటర్ అని చెప్పాలి. వీళ్ళు ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు పెద్దగా జనాలు పట్టించుకోలేదు . ఎప్పుడైతే విడిపోయారో అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు తెగ ట్రోల్ అవుతూ వచ్చాయి. కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకున్నారు .
దానికి కారణాలు అందరికీ తెలిసినవే. అయితే విడాకుల తర్వాత నీ దారి నీది నా దారి నాది అంటూ వెళ్లిన ఈ జంటకు సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా విడాకులు తీసుకున్న సరే అక్కినేని ఫ్యామిలీ సమంత ఫోటోని ఇంకా తన ఇంట్లోనే ఉంచుకుంది అన్న వార్త వైరల్ అవుతుంది. అది కూడా ఫ్యామిలీ ఫోటో కావడంతో ఎటు తుంచలేని విధంగా ఉండిపోయారట.
పెళ్లిలో అక్కినేని నాగార్జున – అమల – నాగచైతన్య – అఖిల్ – సమంత కలిసి ఒక ఫోటో దిగారు . ఆ ఫోటోని ఏకంగా అక్కినేని ఇంటి కాంపౌండ్ లో హాల్లో పెద్దగా డిజైన్ చేయించి అమర్చారు . అయితే విడాకులు తీసుకున్న సరే ఇప్పటికి ఆ ఫోటో అక్కడే ఉండిపోయిందట . దాన్ని తీయడానికి మనసు రాలేదో..? లేకపోతే రీజన్స్ ఏవో కానీ ఇప్పటికీ ఆ ఫోటో అలానే ఉంది అంటున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు..!!