ఇది నిజంగా వైష్ణవి చైతన్యకు జాక్ పాట్ ఆఫర్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు వైష్ణవి చైతన్యకి ఆ ఆఫర్ వచ్చింది ..ఈ ఆఫర్ వచ్చింది అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఈసారి ఏకంగా బడా బ్యానర్ లోని జాక్పాట్ ఛాన్స్ కొట్టేసింది బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య అన్న వార్త మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు బ్యానర్ లో కావడం గమనార్హం.
దిల్ రాజు బ్యానర్ లో వైష్ణవి చైతన్య హీరోయిన్గా దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుందట. గతంలో ఆశీష్ రెడ్డి “రౌడీ బాయ్స్” అనే చిత్రంలో నటించాడు .ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అటు ఇటుగా ఉన్న టాక్ పరంగా మాత్రం పర్లేదు అనిపించుకుంది. హీరోగా ఆశిష్ కెరీర్ ని నిలబెట్టాలని చూస్తున్న దిల్ రాజు బాగా పట్టుదలతో ఉన్నారు.
అందుకే యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్యను తీసుకువచ్చి క్రేజీ కాంబోను ఫిక్స్ చేశాడు. అంతేకాదు ఈ సినిమాకు “లవ్ మీ” అనే రొమాంటిక్ టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఇదే గనక నిజమైతే వైష్ణవి చైతన్య ఖాతాలో రెండో హిట్ పక్కా అని చెప్పాలి. బేబీ సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటి..!!