హిస్టరీని తిరగరాస్తున్న సౌత్ క్విన్..!!

హీరోయిన్ త్రిష దాదాపుగా శబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయక కొనసాగుతోంది. తెలుగు తమిళంలోనే టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా మరొకసారి తన హిస్టరీని తిరగరాస్తోంది. 40 ఏళ్ల వయసులో కూడా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూ అందరికీ షాక్ ఇస్తోంది. గ్లామర్ రూల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది. 20 ఏళ్లుగా హీరోయిన్గా ఉండడం అంటే అది చాలా అదృష్టమని చెప్పవచ్చు.

త్రిష కష్టానికి సైతం ఫలితం దక్కిందని అభిమానుల సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో త్రిష క్రేజ్ అమౌంట్ మారిపోయింది. ఈ సినిమా తర్వాత త్రిష కు వరుసగా ఆఫర్లు వెలుబడుతూనే ఉన్నాయి.. ఇటీవలే విజయ్ దళపతి నటించిన లియో సినిమాలో కూడా నటించింది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ఒక సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మిజ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.

అలాగే తెలుగులో కూడా కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరొకసారి డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ 234వ సినిమాలో కూడా హీరోయిన్గా త్రిష అనే తీసుకోబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా వరుసగా సినిమాలతో ఒక హిస్టరీని తిరగరాస్తోంది సౌత్ ఫిలిం త్రిష అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి త్రిష పడిన కష్టానికి సైతం ఫలితం లభిస్తోందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో త్రిష మరిన్ని సినిమాలతో సక్సెస్ అయి బిజీ కావాలని కోరుకుంటున్నారు. మరి వచ్చే ఏడాదైన వివాహ విషయాన్ని తెలియజేస్తుందేమో చూడాలి మరి.