మాస్ మహారాజ్ రవితేజకు లైఫ్ ఇచ్చింది ఆ ఇద్దరేనా.. అందుకే ఈ స్టేజ్ లో ఉన్నాడా..?!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎటువంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవాడు. తర్వాత సినిమా అవకాశాలను దక్కించుకొని కీరోల్స్‌లో నటిస్తూనే హీరోగా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌లో న‌టిస్తున రవితేజ హీరోగా సక్సెస్ అందుకోవడానికి కారణం వారిద్దరేనంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాలు ఏవి వచ్చేవి కాదని.. ఎంత ట్రై చేసినా ప్రతి క్యారెక్టర్ శ్రీకాంత్ కి వెళ్లేదని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ కూడా మంచి యాక్ట‌ర్‌.. తన ఫ్రెండే కాబట్టి పాజిటివ్గా తీసుకునే వాడ‌ట‌. ఇక అవ‌కాశాలు లేక విసిగిపోయిన రవితేజ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

ఏదో సన్నివేశాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న టైంలో కృష్ణవంశీ రవితేజ నటనను గుర్తించి సింధూరంలో అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ఇక అప్పుటినుంచి ఇండస్ట్రీలో తన యాక్టింగ్ ప్రారంభమైందని.. ఇక తర్వాత పూరి జగన్నాథ్ ఇడియట్ సినిమాతో తన కు మరో లైఫ్ ఇచ్చారని నేను ఈ పొజిషన్లో ఉండడానికి ఆ ఇద్దరు డైరెక్టర్లే కారణమంటూ చెప్పుకొచ్చాడు.