దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మనందరికీ సుపరిచితమే. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా గత ఎన్నికలకు ముందు వచ్చిన ” యాత్ర ” మూవీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వచ్చే ఎన్నికల క్రమంలో యాత్ర సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2 రానుంది. రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర నేపథ్యంలో.. మహి వీ . రాఘవ తొలి పార్ట్ ను తెరకెక్కించాడు.
ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సరివేగంగా జరుగుతుంది. ఈ సినిమాలలో ప్రధాన పాత్రల కోసం ఆసక్తికరమైన క్యాస్టింగ్ సైతం తీసుకుంటున్నారు. ఇక ప్రముఖ పొలిటికల్ పర్సనాలిటీ అయినా సోనియా గాంధీ పాత్ర ఎలా ఉంటుందో తాజాగా ఓ లుక్ రిలీజ్ చేశారు.
సోనియా గాంధీ పాత్రలో ప్రముఖ జర్మన్ నటి సుజానే బర్నాడ్ పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన లుక్ ని చూస్తే సోనియా పాత్రకి ఈమె చాలా అద్భుతంగా సెట్ అయిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో ఈమె పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. యాత్ర సినిమాని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే యాత్ర 2 నీ కూడా 2024 ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సర్వేగంగా షూటింగ్ సాగుతున్న ఈ సినిమాకి మది కెమెరామెన్ గా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.