తండ్రితో గొడవపడ్డ రానా.. కారణం ఏమిటంటే..?

తెలుగు ఇండస్ట్రీలో హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయిపోయారని చెప్పవచ్చు. హీరోగా విలన్ గా నిర్మాతగా టాలీవుడ్లో ఎదుగుదలను కోరుకునే వ్యక్తిగా మంచి పాపులారిటీ సంపాదించారు. మొదట లీడర్ సినిమాతో నటుడుగా తనకి కెరీర్ ని ప్రారంభించిన రానా అంతకముందు..VFX స్టూడియోను కూడా నడిపేవారట అయితే ఆ కంపెనీ కొన్ని కారణాలవల్ల అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆ టైంలో జరిగిన కొన్ని విషయాలను హీరో రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరుగుతోంది.

18 సంవత్సరాల క్రితం రానా స్పిరిట్ మీడియా అనే ఒక విజువల్ ఎఫెక్ట్ సంస్థని సైతం ప్రారంభించారట. ఐదేళ్లపాటు ఆ కంపెనీ నడిపించారు.. బాహుబలి వంటి గ్రాఫికల్ వండర్ సినిమాను కూడా ఆ సంస్థలోనే తెరకెక్కించాలనుకున్నారట ..కానీ అలాంటి సమయంలో అలాంటి చిత్రాలు తీసే సాహసం ఎవరు చేయలేదట. నాలుగేళ్లు ఈ కంపెనీని ఎలాగోలాగా రానా నెట్టుకొచ్చాడట. 5వ ఏట తన వల్ల కాకపోవడంతో అమ్మేశానని.. సరదాగా చేసే వ్యాపారం కాదని భావించానని అమ్మేశారట. ఇప్పుడు ఇది ప్రపంచంలోని పెద్ద విజువల్ ఎఫెక్ట్ గా మారిపోయిందని తెలిపారు.

రానా ఈ కంపెనీ నడుపుతున్న సమయంలో బొమ్మలాట అనే చిత్రాన్ని నిర్మించారు. దీనికి రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి కానీ థియేటర్లో విడుదల కాలేదు. ఈ కంపెనీని అమ్మేయడంతో రానా ఇంటిలో ఒక నెలరోజుల పాటు గొడవలు జరిగాయట.తన తండ్రి సురేష్ బాబుతో రానాతో కొద్దిరోజులు కూడా మాట్లాడడం మానేశారట. అయితే ఆ సమయంలో తనకి ఆ కంపెనీ అమ్మడం తప్ప మరే మార్గం లేదని కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ గా మారుతున్నాయి.