సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. ఈ సినిమాలో సీతగా, ప్రిన్సెస్ నూర్జహాన్‌గా తన నటనతో, కట్టుబొట్టుతో కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా నానితో మృణాల్ నటించిన హాయ్ నాన్న డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సోషియ ఫాంటసీ సినిమాకి కూడా ఓ హీరోయిన్గా మృణాల్ సెలెక్ట్ అయిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది.
ఇక ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నా కెరీర్ చాలా బాగుంది. నేను ఎలాంటి సినిమాలు చేయాలని కోరుకున్నాను అలాంటి సినిమాల అవకాశాలే నాకు వస్తున్నాయి. అంతా సీతారామం మూవీ క్రెడిట్. నాకు ఫాంటసీ సినిమాలంటే చాలా ఇష్టం. వెబ్ సిరీస్ బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ లో ఇప్పటికే 10 ఎపిసోడ్లలో నేను నటించాను. ఇందులో యువరాణి శివగామిగా నేను నటించా.. కానీ నా పాత్రను వామిక గబ్బి నటించినట్లు న్యూస్ వైరల్ అయ్యాయి.
అవన్నీ రూమర్స్. ఆ సిరీస్ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. ఆశగా ఎదురు చూశా.. కానీ అది రిలీజ్ కాలేదు. కానీ రిలీజ్ అయితే మాత్రం కచ్చితంగా దాన్ని ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నా అంటూ వివరించింది. కేవలం చిన్న సినిమాలే చేయాలి, పెద్ద సినిమాలే చేయాలి, కేవలం సినిమాలు మాత్రమే చేయాలని రూలేం పెట్టుకోలేదు. కథ నచ్చితే వెబ్ సిరీస్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా అంటూ వివరించింది మృణాల్ ఠాగూర్.