బాక్సాఫీస్ బరిలో పోటీకి సిద్ధమవుతున్న బాబాయ్ – అబ్బాయి.. అప్పటి రిజల్ట్ రిపీట్ అవుతుందా..?

నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్యన భారీ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వాళ్ళ‌ ఫ్యాన్స్ మధ్యన చర్చలు కూడా నడుస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగనే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు బహిర్గతంగానే బయటపడింది. దీంతో ఆ ఎఫెక్ట్ బాలయ్య తాజా మూవీ భగవంత్‌ కేసరి పై పడింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ సినిమాను చూడొద్దంటూ నెట్టింట న్యూస్ వైరల్ చేశారు. ఇలా బాబాయ్ అబ్బాయి మధ్య వైరం స్టార్ట్ అయిందనే చెప్పాలి.

ఇలాంటి నేపథ్యంలో 2004 వేసవి సెలవుల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగినున‌ట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే దేవర సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని కొరటాల శివ ప్రకటించాడు. ఇక తాజాగా బాలకృష్ణ NBK109 మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీతారా ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందుతుంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం NBK109 సినిమాను ఎలాగైనా 2024 మార్చి 29 నాటికి పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సరిగ్గా దేవర మూవీకి ఒక వారం ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ బాబాయ్ – అబ్బాయిల మధ్య బాక్సాఫీస్ బరిలో వార్ మొదలవడం ఖాయం.

ఒకవేళ ఇదే నిజమైతే తారక్ మరోసారి సక్సెస్ అందుకోవడం ఖాయమంటూ న్యూస్ వినిపిస్తుంది. తారక్‌ వెంట నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఎందుకంటే తారక్ మిగతా హీరోలతో కూడా ఎంతో క్లోజ్ గా ఉండే సంగతి తెలిసిందే. దీంతో మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ సినిమాను చూడడానికే మొగ్గు చూపుతారు. ఇక గతంలో 2016 న నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్, డిటెక్టర్ సినిమాతో బాలయ్య ఒకేసారి సంక్రాంతి బరిలో దిగారు. జనవరి 13న తారక్‌ వస్తే జనవరి 14న బాలయ్య డిటెక్టర్ తో వచ్చాడు. అలా మొదటిసారి బాబాయ్ అబ్బాయిలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడగా ఆ సమయంలో ఎన్టీఆర్ పైచేయి సాధించాడు.

ఆ క్రమంలో ఇద్దరి ఫాన్స్ మధ్యన పెద్దవారు కూడా నడిచింది. మళ్లీ ఇదే రిజ‌ల్ట్‌ 2024 రిపీట్ అవ్వబోతుందా? అప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ మద్దతు కూడా ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్‌కే ఉంటుంది. ఇక ఎన్టీఆర్ దేవర థియేటర్స్‌లోకి వచ్చే ముందు వరకే బాలయ్య NBK109 హడావిడి ఉంటుంది. ఏప్రిల్ 5 నుంచి ఎన్ని సినిమాలు వచ్చిన దేవరకు పోటీగా నిలబడలేవు అది నందమూరి బాలకృష్ణ సినిమా అయినా నో డౌట్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వేళ ఈ న్యూస్ నిజ‌మైతే బాక్స్ ఆఫీస్ బారిలో ఈ సారి విజ‌యం బాబాయి, అబ్బాయిల‌లో ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.