లియో ఓటిటి డేటు పై క్లారిటీ ఇచ్చిన నెట్ ఫిక్స్..!!

సౌత్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని చాలామంది హీరోలు సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. కోలీవుడ్లో స్టార్ హీరో గా పేరు పొందిన విజయ్ దళపతి డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం లియో.. ఈ సినిమా దసరా కానుక ప్రత్యేక ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సరసన త్రిష నటించింది.. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ భాగంలో తెరకెక్కించడం జరిగింది.

లియో సినిమా ఇప్పటివరకు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటి విడుదల కోసం అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. దీంతో ఓటిటి తెది పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.. ఈ సినిమా థియేటర్లో విడుదలైన 4 వారాలకే ఓటీటి లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. అంటే ఈ రోజున స్ట్రిమింగ్ అవుతుందని అందరూ అనుకున్నారు.. అయితే ఈ విషయం పైన ఎలాంటి క్లారిటీ రాకపోవడం జరిగింది.

దీంతో ఇప్పుడు తాజాగా ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లియో సినిమాను భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాని ఓటీటి లో ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది.. నవంబర్ 21న లియో సినిమా అన్ని భాషలలో ఓటీటి లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. లియో సినిమా అప్డేట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు సైతం ఈ విషయం చాలా ఆనందాన్ని సైతం కలిగిస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ఓటీటి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)