శ్రీలీల.. విజయ్ సినిమా రిజెక్ట్ చేయడానికి అసలు కారణం అదేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ హీరోయిన్గా దూసుకుపోతుంది శ్రీలీల. పెళ్లి సందడి లాంటి చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తరువాత రవితేజ ధమాకా తో మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమాలో తన డ్యాన్స్, నటనతో కోట్లాదిమంది ఫ్యాన్స్ ఆమెకు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే మెగా హీరో వైష్ణవి తేజ్ తో ఆదికేశవ సినిమాలో నటించింది. సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది.

అయితే గతంలో విజయ్ దేవరకొండ సినిమా వీడి 12 లో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొన్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో నటిస్తానని అగ్రిమెంట్ పైన కూడా సైన్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమా మొదలుపెట్టిన తరువాత విజయ్ తో లిప్ లాక్ సీన్లు, బెడ్రూం సీన్లు ఉంటాయని తెలుసుకొని.. నాకు ముందుగా ఈ మూవీలో ఇలాంటి సీన్లు ఉంటాయని ఎందుకు చెప్పలేదు.. నేను ఈ సినిమా చేయను అంటూమేక‌ర్స్‌కి చెప్పేసిందట.

అయితే శ్రీ లీలా ముందుగానే అగ్రిమెంట్ పై సైన్ చేసి ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాలంటే మీరు రూ.30 లక్షలు కట్టవలసి ఉంటుంది.. దానికన్నా మీరు ఈ సినిమాలో నటించడమే బెస్ట్ అంటూ డైరెక్టర్ సర్ది చెప్పాలని చూసాడట. శ్రీ లీలా దీని గురించి ఎటువంటి టాపిక్ రేజ్‌ చేయకుండా రూ.30 లక్షలు కట్టి సినిమా నుంచి తప్పుకుందంటూ న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టాలీవుడ్ లో ఇలాంటి హీరోయిన్స్ కూడా ఇంకా ఉన్నారా.. అలాంటి సీన్లు నటించకుండా ఉండాలని సినిమాలు రిజెక్ట్ చేసి నష్టపోయినా సరే డబ్బు గురించి వెనకడుగు వేయని వాళ్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. శ్రీలీలని చూస్తే చాలా ముచ్చటేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.